కూట‌మి వ‌ద్ద రెండు రెడ్ బుక్‌లు

కూట‌మి వ‌ద్ద రెండు రెడ్ బుక్స్ ఉన్నాయి. ఒక‌టేమో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌ద్ద‌, మ‌రొక‌టి సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేశ్ వ‌ద్ద ఉండ‌డం విశేషం. ఆ రెండు రెడ్‌బుక్స్‌లో కంటెంట్…

కూట‌మి వ‌ద్ద రెండు రెడ్ బుక్స్ ఉన్నాయి. ఒక‌టేమో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌ద్ద‌, మ‌రొక‌టి సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేశ్ వ‌ద్ద ఉండ‌డం విశేషం. ఆ రెండు రెడ్‌బుక్స్‌లో కంటెంట్ మాత్రం వేరుగా ఉంది. లోకేశ్ చెంత ఉన్న రెడ్‌బుక్ పూర్తిగా రాజ‌కీయ‌ప‌ర‌మైంది. ప‌వ‌న్ రెడ్‌బుక్ పూర్తిగా స‌నాత‌న ధ‌ర్మానికి సంబంధించింది. కానీ రెండింటిపై విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

లోకేశ్ వ‌ద్ద రెడ్‌బుక్‌లోని వివ‌రాలు ఇంత వ‌ర‌కూ వెల్ల‌డి కాదు. ప‌వ‌న్ రెడ్‌బుక్‌లో ఏముందో ఇవాళ సాయంత్రం ఆయ‌న తిరుప‌తిలో వివ‌రించ‌నున్నారు. అయితే లోకేశ్ రెడ్‌బుక్ పాల‌న రాష్ట్రంలో సాగుతోంద‌ని వైసీపీ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. రాజ‌కీయంగా, అలాగే త‌మ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై అన్యాయంగా కేసులు పెట్టి వేధించిన పోలీస్ అధికారుల వివ‌రాల్ని రెడ్‌బుక్‌లో రాసుకున్న‌ట్టు పాద‌యాత్ర సంద‌ర్భంలో లోకేశ్ చెప్పారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వాళ్ల అంతు చూస్తామ‌ని హెచ్చ‌రించారు.

ఇప్పుడు రెడ్‌బుక్ పాల‌న మొద‌లైంద‌ని లోకేశ్ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు, కొన్ని చోట్ల హ‌త్య‌లు య‌థేచ్ఛ‌గా సాగాయి. అలాగే వారి ఆస్తుల‌పై దాడులు జ‌రిగాయి. ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల‌కు పోస్టింగ్‌లు ఇవ్వ‌క‌పోవ‌డం, కొంద‌రిపై కేసులు, స‌స్పెన్షన్‌లు రెడ్‌బుక్ పాల‌న‌లో భాగమే. ఇది కూట‌మి స‌ర్కార్‌కు బాగా చెడ్డపేరు తీసుకొస్తోంది. ఇది ఎంత కాల‌మో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఐదేళ్లు రెడ్‌బుక్ పాల‌నే జ‌రిగితే, ఇక చెప్పుకోడానికి ఏమీ మిగ‌లదు.

ఇక ప‌వ‌న్ రెడ్‌బుక్ విష‌యానికి వ‌స్తే, రానున్న కాలంలో ఎలా వుంటుందో తిరుప‌తి స‌భ‌లో ఆయ‌న వివ‌రిస్తారు. లోకేశ్ రెడ్‌బుక్ పాలన‌కు ఏ మాత్రం త‌క్కువ కాని ప్ర‌మాదక‌ర ప‌రిస్థితుల్ని తీసుకొచ్చే అవ‌కాశం లేక‌పోలేదు. రాజ‌కీయాల్లోకి మ‌తం ప్ర‌వేశిస్తే ఏమ‌వుతుందో అనేక అనుభ‌వాలు మ‌న దేశంలో ఉన్నాయి. అన్నీ తెలిసి కూడా మ‌తాన్ని తీసుకొస్తాన‌ని ప‌వ‌న్ ఉత్సాహం చూపుతున్నారు. రెడ్‌బుక్‌ల సంగ‌తి ఇదీ.

8 Replies to “కూట‌మి వ‌ద్ద రెండు రెడ్ బుక్‌లు”

  1. వాత లోతుగా పడితే కానీ cid సంజయ్ లాగా తప్పుడు కేసులు పెట్టి లోపలేసే అధికారులు భయపడరు చర్యలు సరిగ్గ లేకపోతె మరల కొత్తవాడు వస్తే మల్లి మామూలుగానే తప్పుడు పనులు చేస్తారు

Comments are closed.