టాలీవుడ్ హీరోయిన్ సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పకుండా, కేవలం తన వ్యాఖ్యలను మాత్రమే వెనక్కి తీసుకుంటానని ప్రకటించడం గమనార్హం. ఎక్స్ వేదికగా కొండా సురేఖ వరుస పోస్టులను ఆమె పెట్టడం విశేషం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కొండా సురేఖ మధ్య సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల విషయమై గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో కేటీఆర్‌ను దూషించడంలో భాగంగా హీరో అక్కినేని నాగార్జున కుటుంబాన్ని సురేఖ బజారుకీడ్చారు. నాగచైతన్య, సమంతా విడిపోవడానికి కేటీఆరే కారణమని సంచలన ఆరోపణలు చేశారు.
కొండా సురేఖ ఆరోపణలపై చిత్రపరిశ్రమ తీవ్రంగా స్పందించింది. తమను అనవసరంగా వివాదాల్లోకి ఎందుకు లాగుతున్నారని ఆవేదనతో సినీ ఇండస్ట్రీ నిలదీసింది. విమర్శలు వెల్లువెత్తడంతో సురేఖ కాస్త వెనక్కి తగ్గారు. సురేఖ వివరణ ఏంటో తెలుసుకుందాం.
“నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ (సమంత) మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా.
నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. అన్యదా భావించవద్దు”
సమంత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం వరకూ ఓకే. మరి నాగార్జున, నాగచైతన్యల సంగతేంటి? వాళ్ల పరువును బజారుకీడ్చడంపై చిత్ర పరిశ్రమ మండిపడుతోంది కదా! సురేఖ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటానని చెప్పిందే తప్ప, క్షమాపణ ఊసే ఎత్తకపోవడం గమనార్హం.
First adhi aame account kaadho check chesuko GA
రంభ, రమ్యకృష్ణ, మీనా, సుహాసిని, కుష్బూ మరియు రాధికా వీరంతా కేవలం రోజాకి జరిగే నగుబాటు మీదనే స్పందిస్తారన్నమాట! అదేమిటో శ్రీ రోజా కూడా స్పందించనేలేదు!
మన Paytm కుక్కలకు కూడా కొంచెం చెప్పు GA…. వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి నీచంగా మాట్లాడడం వల్ల నష్టమే తప్ప లాభం వుండదని…
Call boy jobs available 9989793850
they want to degrade People are supporting ycp….