స్వతంత్ర సంస్థను వేస్తే బాబు అండ్ కో సిగ్గుపడాలి!

సుప్రీం తీర్పులో స్వతంత్ర సంస్థ దర్యాప్తుకు ఆదేశిస్తే గనుక.. చంద్రబాబు మరియు పవన్ కల్యాణ్ తదితరులు సిగ్గుతో తలదించుకోవాల్సిందేనని ప్రజలు అనుకుంటున్నారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరుగుతున్నదా? లేదా? ఏస్థాయి కల్తీ జరుగుతున్నది? జంతుకొవ్వులు, పందికొవ్వు అందులో కలుపుతున్నారా? లేదా? అనేది ఇవాళ దేశాన్ని కుదిపేస్తున్న వ్యవహారాల్లో ఒకటి. ఈ విషయం ప్రస్తుతం సుప్రీం కోర్టు ఎదుట ఉంది. ఇవాళ ఆ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను కొనసాగించాలా? లేదా, స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమించాలా? అనేది సుప్రీం తీర్పులో తేలుతుంది. ఇప్పటికే మూడురోజుల సాగిన సిట్ దర్యాప్తును రాష్ట్ర డీజీపీ నిలిపివేసిన నేపథ్యంలో.. తీర్పులో సుప్రీం కోర్టు గనుక.. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా మాత్రమే విచారణ జరగాలని ఆదేశిస్తే గనుక.. అది చంద్రబాబు అండ్ కో కు సిగ్గు చేటు వ్యవహారం అవుతుంది.

తిరుమలేశుని లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యిని కిలో 327 నుంచి 400 రూపాయల వరకు ధరకు సప్లయి చేస్తామని టెండర్లు పొందిన వ్యక్తులు వాటిని కల్తీ చేశారని అంటే నమ్మడానికి అవకాశం ఉంది. అయితే.. పందికొవ్వు, గొడ్డు కొవ్వు, జంతువుల వ్యర్థాలతో కల్తీ చేశారని.. ఆ నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించడం ద్వారా.. ఒక పెద్ద దుమారానికి తెరలేపారు. ఈ వ్యవహారంపై దేశమంతా అట్టుడికిపోయింది. జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా ప్రొజెక్టు చేయడానికి ఎన్డీయే కూటమి దళాలన్నీ తెగ ప్రయత్నించాయి. పవన్ కల్యాణ్ ఒక అడుగు ముందుకేసి.. ఇదే అదనుగా తాను మైలేజీ తీసుకోవాలని కూడా భావించారు. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష అన్నారు.

ఈలోగా జగన్మోహన్ రెడ్డే స్వయంగా నెయ్యిని కల్తీ చేశారని జనం నమ్మే స్థాయిలో చంద్రబాబు సహా తెలుగుదేశం వారంతా తెగ ప్రచారం చేశారు. ఏ తప్పు జరిగిందో, ఎవరు తప్పు చేశారో.. అన్ని సంగతులూ ఒకవైపు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రభుత్వాధినేత చంద్రబాబు బహిరంగంగా మాట్లాడేస్తూ.. దర్యాప్తు చేయిస్తాం అంటూ సిట్ ను ఏర్పాటు చేయడం ఒక కామెడీ! దానిపై అభ్యంతరాలు వ్యక్తమై పిటిషన్లు దాఖలు కావడంతో.. సుప్రీం కోర్టు సిట్ దర్యాప్తును నిలిపివేసింది.

ప్రభుత్వం వద్ద పనిచేసే సిట్ ప్రభుత్వాధినేత ప్రకటించిన వివరాలను ధ్రువీకరించడానికే పనిచేస్తుంది తప్ప.. నిజాలను తేల్చడానికి కాదనేది పలువురి సందేహం. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పులో స్వతంత్ర సంస్థ దర్యాప్తుకు ఆదేశిస్తే గనుక.. చంద్రబాబు మరియు పవన్ కల్యాణ్ తదితరులు సిగ్గుతో తలదించుకోవాల్సిందేనని ప్రజలు అనుకుంటున్నారు.

15 Replies to “స్వతంత్ర సంస్థను వేస్తే బాబు అండ్ కో సిగ్గుపడాలి!”

  1. స్వతంత్ర దర్యాప్త లేక సిట్ ఇప్పుడు అనవసరం..
    కల్తీ జరిగింది లేదు అనేది ముందు తేలాలి. కల్తీ జరగింది అప్పుడు ఏంటి ?
    ఎవరు ఇందులో ఉన్నారు అనేది బయటపడాలి.
  2. ఈరోజే ఎదో తీర్పు గానీ, ఆదేశాలు గానీ వస్తాయనుకోవడం భ్రమ. నేడు కూడా కొన్ని వ్యాఖ్యానాలకే సమయం వెచ్చించి, అలా కొన్ని వివరాలు సాగదీసాక ఆదేశం వస్తుంది. నేడు అలంటి report ఇచ్చిన NDDB ని వేసుకుంటారు.

  3. Me YCP cheap bathukulu, Ippude CBI vaste nijalu telustai anataru, ade CBI ni babai case lo enno ibbandulu pettaru, CBI SP RamSingh meedha case kuda pettaru, meeru neethi kaburlu cheptunnaru, Thu… siggu leni bathukulu

  4. బాబయి ని చంపి CBI వద్దు CID తొ పని కానిచెస్తాం అంటె సిగ్గు పడాలి కాని, దీనికి అవసరం లెదు.

  5. కల్తి నెయ్యి వాడినందుకు మీరు గర్వపడుతున్నారా GA…. ఐనా మీరు చేసే అతి నీచమైన పనులకు కూడా మీకే ADVANTAGE, SYMPATHY,MILEAGE కావాలనే మీ నీచమైన అత్యాశ కి….🙏🙏🙏

  6. వైఎ*స్ఆర్ మర*ణం వెను*క కు*ట్ర అనుమా*నం మీద కూడా F*BI వాళ్ళతో స్వతంత్ర విచారణ చేపించాలె,.

    ఆయన అభిమానుల మనో వేదన తీర్చాలి.

    ఆయన తమ్ముడి సంగతి చూసాక ఇంటి లో వాళ్ళే చెపించాడ అని అనుమానం,వైఎ*స్ఆర్ అభి*మానులకి.

  7. మొన్న సోమవారంమే ప్రభుత్వం / టీటీడీ తరుపున లాయర్లు చాలా క్లారిటీ గా చెప్పారు ఎవ్వరి చేత దర్యాప్తు చేసిన మాకు సమ్మతమే అని . అందుకే సిట్ ని నిలిపివేసింది కూడా ప్రభుత్వం . ఇప్పటి వరకు జగన్ గాని సుబ్బారెడ్డి గాని సిబిఐ దర్యాప్తు చేయించమని ఆడలేదు . జగన్ రెండు లెటర్లు రాసాడు ప్రధాన మంత్రికి రెండిట్లో కూడా సిబిఐ దర్యాప్తు కావాలని అడగలేదు . సిట్ దర్యాప్తు కంటిన్యూ చేసి వై చీపి కి ప్రతికూలంగా రిపోర్ట్ వచ్చి ఉంటె ..అది సీబీన్ మనుప్లేటే చేసిన దర్యాప్తు అని బుకాయించడానికి అయినా స్పేస్ ఉండేది ..అదే సిబిఐ దర్యాప్తు చేసి రిపోర్ట్ అనుకూలంగా రాకపోతే రాదుకూడా ఎందుకంటే అన్ని ఆధారాలు ఉన్నాయి .. ఇక బుకాయించాడానికి కూడా స్పేస్ ఉండదు .

Comments are closed.