సురేఖ వ్యాఖ్య‌ల‌కు చాలా బాధ‌ప‌డ్డాను!

సినీ హీరో అక్కినేని నాగార్జున కుటుంబం, అలాగే హీరోయిన్ స‌మంత‌పై మంత్రి కొండా సురేఖ అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్‌పై చిత్ర‌ప‌రిశ్ర‌మ భ‌గ్గుమంది. రాజ‌కీయాల్లోకి త‌మ‌నెందుకు లాగుతున్నారంటూ చిత్ర‌ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, వివిధ…

సినీ హీరో అక్కినేని నాగార్జున కుటుంబం, అలాగే హీరోయిన్ స‌మంత‌పై మంత్రి కొండా సురేఖ అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్‌పై చిత్ర‌ప‌రిశ్ర‌మ భ‌గ్గుమంది. రాజ‌కీయాల్లోకి త‌మ‌నెందుకు లాగుతున్నారంటూ చిత్ర‌ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, వివిధ మాధ్య‌మాల వేదిక‌గా ఘాటుగా స్పందించారు.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదిక‌గా త‌న ఆవేద‌న‌, ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. సినీ ప‌రిశ్ర‌మ‌కు అన‌ధికార పెద్ద దిక్కుగా చిరంజీవిని ప్ర‌తి ఒక్క‌రూ చూస్తున్నారు. అందుకే ఆయ‌న స్పంద‌న‌కు విలువ ఏర్ప‌డింది. చిరంజీవి పోస్టు ఏంటంటే…

“గౌర‌వ‌నీయులైన మ‌హిళా మంత్రి వ్యాఖ్య‌లు న‌న్ను చాలా బాధ‌పెట్టాయి. సెల‌బ్రిటీలు, ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు టార్గెట్‌గా మార‌డం సిగ్గుచేటు. మా చిత్ర ప‌రిశ్ర‌మ స‌భ్యుల‌పై ఇలాంటి దుర్మార్గ‌పు మాట‌ల దాడుల‌ను మేమంతా ముక్త‌కంఠంతో వ్య‌తిరేకిస్తాం. రాజ‌కీయాల‌తో ఏ మాత్రం సంబంధం లేని మ‌హిళ‌ల‌ను ఇందులోకి లాగ‌డం స‌రైంది కాదు. త‌మ రాజ‌కీయ మ‌నుగ‌డ కోసం అభ్యంత‌ర‌క‌ర‌ రీతిలో క‌ల్పిత ఆరోప‌ణ‌లు చేయ‌డం ఏ మాత్రం మంచిది కాదు. రాజ‌కీయాల కోసం ఇంత నీచ‌మైన స్థాయికి దిగ‌జారకూడ‌దు” అని చిరంజీవి ఘాటుగా స్పందించారు.

కేటీఆర్‌ను టార్గెట్ చేయ‌డంలో కొండా సురేఖ కామెంట్స్ బూమ‌రాంగ్ అయ్యాయి. చిత్ర‌ప‌రిశ్ర‌మంతా కాంగ్రెస్ స‌ర్కార్‌పై విరుచుకుప‌డుతోంది. కాంగ్రెస్ స‌ర్కార్‌కు చెడ్డ‌పేరు వ‌చ్చేలా కొండా సురేఖ కామెంట్స్ ఉన్నాయ‌నే భ‌యం ఆ పార్టీ శ్రేణుల్లో కూడా వుంది.

11 Replies to “సురేఖ వ్యాఖ్య‌ల‌కు చాలా బాధ‌ప‌డ్డాను!”

  1. సినిమా వెదవలు మాట్లాడితే రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు?హైద్రాబాద్ లో ఉంటూ ఆంధ్ర లో వేలు పెడుతున్నారు అందుకే అలా జరగాలి

  2. అందరూ సురేఖ సురేఖ అంటూ ఉంటె మధ్యలో అయన శ్రీమతి పేరు చెడిపోతుందేమో అని ఈయన బాధనేమో…

  3. Atyunnata sthanam lo vundi ilanti comments cheyatam anedi neti Rajakeeya nayakulake chellindi ilanti dhoranulu chuse evaru rajakeeyalu ante istapadaru cheyalsina damage chesi simple ga kshamapana ante saripotunda

Comments are closed.