కొండా సురేఖ Vs నాగార్జున.. కోర్టు ఏం చెప్పింది?

నాగార్జునపై, సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో నాగచైతన్య-సమంత విడాకుల అంశాన్ని ఆమె అభ్యంతరకరంగా ప్రస్తావించారు. ఆ వెంటనే ఆమె తన…

నాగార్జునపై, సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో నాగచైతన్య-సమంత విడాకుల అంశాన్ని ఆమె అభ్యంతరకరంగా ప్రస్తావించారు. ఆ వెంటనే ఆమె తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు.

అయితే నాగార్జున మాత్రం ఈ విషయంపై సీరియస్ గా ఉన్నాడు. సురేఖ వ్యాఖ్యల్ని ఖండించిన ఈ నటుడు, ఆమెపై పరువు నష్టం దావా వేశాడు. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో ఈరోజు విచారణ జరిగింది.

తనపై, తన కుటుంబంపై, కుమారుడు నాగచైతన్య విడాకుల అంశంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని, తన ప్రతిష్టను దిగజార్చాయని నాగ్ అందులో ఆరోపించారు. దురుద్దేశంతో, రాజకీయ ప్రేరేపణతో మంత్రి ఆ వ్యాఖ్యలు చేశారని నాగ్ తన అఫిడవిట్ లో పేర్కొన్నాడు.

దీనిపై స్పందించిన కోర్టు.. నాగార్జున స్టేట్ మెంట్ ను రికార్డు చేయాలని, దాన్ని డాక్యుమెంటేషన్ చేసి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. రేపు నాగార్జున స్టేట్ మెంట్ ను డాక్యుమెంట్ చేస్తారు. నేరుగా నాగార్జున స్టేట్ మెంట్ ఇస్తాడా లేక ఆయన తరఫున వేరే వ్యక్తి ఎవరైనా ముందుకొస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

మరోవైపు మంత్రి సురేఖ తరఫు న్యాయవాదాలు ఈ కేసును కొట్టిపారేస్తున్నారు. మంత్రి భేషరతుగా తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకున్న నేపథ్యంలో అసలు కేసు నిలబడదంటున్నారు.

ఈ కేసు వెనక కేటీఆర్ ఉన్నారని ఆరోపిస్తున్నారు సురేఖ తరఫు లాయర్లు. కేటీఆర్ కావాలనే నాగార్జున ద్వారా మంత్రిపై కేసు వేయించారని తాము భావిస్తున్నామని… కాబట్టి తాము కూడా నాగార్జునపైన, నాగార్జునకు మద్దతిచ్చిన అందరిపైన కేసులు వేస్తామని హెచ్చరిస్తున్నారు.

23 Replies to “కొండా సురేఖ Vs నాగార్జున.. కోర్టు ఏం చెప్పింది?”

      1. సమంత-ని-లోబరుచుకుని-ఫార్మ్-హౌస్-లోకి-తీసుకెళ్లి-రోజులతరబడి-వాడుకున్న-రకుల్-రావ్-గాడి-బలుపు-డ్రామాలు-తప్పు-లేదు-అంటావా

          1. anni vodilesi mandi meeda paddav. em bathuku ra. Mata matlade mundu manchi chedda, manam maryada em levara? valla divorce papers neeku evadichadu chadavataniki? vallu iddare kadu chala cinema jantalu divorce teesukunnayi, oka aasti kosam kodalini pandabedtarara? vadiki unna astullo adokati lekkana?

  1. Ithe sureka venaka vundi AA matalu anipinchina vallanu emi cheyyali

    Nag eka kuda pekaleru konda surekamu

    Jail lo pettali thappudu matalu anadam venakku thisukunnanu anadam.matanu venakku thisukunna ante thappu oppkunnatle kadha

  2. “ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం అని ప్రభుత్వ అధికారులతో పాటు కోర్టు కూడా ఎప్పుడో ధ్రువీకరించింది. అయినా దాన్ని కూలగొట్టలేదు. 2014లో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఎన్ కన్వెన్షన్ మీద సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని కోరింది. అప్పుడు హెచ్‌ఎండీఏ సర్వే చేసి 2016లో నివేదిక ఇచ్చింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో మూడున్నర ఎకరాలు ఆక్రమించి ఈ నిర్మాణం చేశారని, ఇది అక్రమ కట్టడం అని అందులో పేర్కొన్నారు. అయినా అప్పటి ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని కూలగొట్టలేదు. అప్పుడే అక్కినేని వారి కోడలు సమంత చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఆమెకు చేనేత తెలవదు, చీర తెలవదు. ఆమెను తెచ్చి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ చేశారు. ఆ సంబంధాలేంటో వాళ్లకే తెలియాలి. అప్పుడున్న వాళ్లకు రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏంటో వాళ్లు చెప్పాలి. అవన్నీ చెప్పి నా నోరు పాడు చేసుకోను” అని రఘునందన్ రావు ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు

Comments are closed.