ఇదే సరైన సమయం.. మళ్లీ మొదలైన చర్చ

నాగచైతన్య కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీగా వస్తోంది తండేల్. గీతాఆర్ట్స్-2 లాంటి పెద్ద బ్యానర్.. చైతూ-సాయిపల్లవి క్రేజీ కాంబినేషన్.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిస్మస్…

నాగచైతన్య కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీగా వస్తోంది తండేల్. గీతాఆర్ట్స్-2 లాంటి పెద్ద బ్యానర్.. చైతూ-సాయిపల్లవి క్రేజీ కాంబినేషన్.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలనుకున్నారు.

కట్ చేస్తే.. ఊహించని విధంగా డిసెంబర్ లో పోటీ పెరిగింది. ఆగస్ట్ లో వస్తుందనుకున్న అల్లు అర్జున్ పుష్ప-2, ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన గేమ్ ఛేంజర్ డిసెంబర్ కు వచ్చి పడ్డాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య తండేల్ ను క్రిస్మస్ నుంచి తప్పించాల్సి వచ్చింది.

అయితే తాజాగా మళ్లీ పరిస్థితులు మారిపోయాయి. క్రిస్మస్ కు రావాల్సిన గేమ్ ఛేంజర్ మళ్లీ వాయిదా పడింది. అది సంక్రాంతికి వెళ్లిపోయింది. దీంతో తండేల్ సినిమాపై మళ్లీ చర్చ మొదలైంది.

నిజానికి బరిలో గేమ్ ఛేంజర్ ఉంది కాబట్టి తండేల్ యూనిట్ సైలెంట్ అయింది. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ చెబుతామంటూ నిర్మాత బన్నీ వాసు తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు క్రిస్మస్ డేట్ ఖాళీ అయింది.

దీంతో తండేల్ విడుదల తేదీని క్రిస్మస్ కు ప్రకటించాలనే డిమాండ్స్ ఊపందుకున్నాయి. గేమ్ ఛేంజర్ వాయిదా పడ్డంతో, ఇప్పటికే సారంగపాణి లాంటి చిన్న సినిమాలు క్రిస్మస్ డేట్స్ ప్రకటిస్తున్నాయి. నితిన్ రాబిన్ హుడ్ నుంచి కూడా ప్రకటన వచ్చేసింది. సో.. ఇదే సరైన సమయం.. వెంటనే డేట్ ప్రకటిస్తే, అన్నీ సర్దుకుంటాయని ట్రేడ్ భావిస్తోంది. మరి ఆ ప్రకటన ఎప్పుడు?.

2 Replies to “ఇదే సరైన సమయం.. మళ్లీ మొదలైన చర్చ”

Comments are closed.