వయా సీఐడీ: కక్ష సాధింపుల్లో ఇక జోరు పెరుగుతుందా?

పాలకులు కోరుకున్న రీతిలో దర్యాప్తు సాగడానికి, తలచిన వ్యకులను టార్గెట్ చేయడానికే ఇలా చేశారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల మీద కక్ష సాధింపు చర్యల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం గేరు మార్చింది. ప్రధానంగా వారిని టార్గెట్ చేస్తూ నమోదు చేసిన కేసులు అన్నింటినీ.. సాధారణ పోలీసు శాఖ నుంచి తాజాగా సీఐడీకి బదిలీ చేశారు. దీంతో ఈ కేసుల దర్యాప్తు చురుగ్గా జరుగుతుందని, తొందరగా ఒక కొలిక్కి వస్తాయని అనుకుంటున్నారు. అన్నింటినీ మించి.. పాలకులు కోరుకున్న రీతిలో దర్యాప్తు సాగడానికి, తలచిన వ్యకులను టార్గెట్ చేయడానికే ఇలా చేశారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద, చంద్రబాబునాయుడు నివాసం మీద దాడులు, దాడికి ప్రయత్నాలు జరిగాయి. వీటిమీద వేర్వేరుగా కేసులు నమోదు అయ్యాయి. వైసీపీ కీలక నాయకులు సజ్జల రామక్రిష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేశ్, దేవినేని అవినాష్ తదితరుల మీద ఈ కేసులు బలంగానే పెట్టారు. ఇదే కేసుల్లో నందిగం సురేశ్ అరెస్టు అయ్యారు కూడా. ఇప్పుడు ఈ కేసులన్నీ సీఐడీకి బదిలీ అయ్యాయి. ఈ కేసుల్లో నిందితులు విచారించడంలో.. వైసీపీలో ఇంకా పెద్ద నాయకుల పేర్లను రాబట్టాలని, వారి మీద కూడా కేసు నమోదు చేయాలనే ఆరాటం ఉన్నట్టుగా పుకార్లున్నాయి.

వీటిని మించినది కాదంబరి జెత్వానీ కేసు. ఈ కేసుకు ఏపీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నదా? అనిపించేంత సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ కేసు మీద ప్రభుత్వంలోని పెద్దలకు చాలా చాలా ఆశలున్నాయి. ఈ ఒక్క కేసులోనే వైసీపీ పెద్దలను బాగా ఇరికించవచ్చునని.. కనీసం, వారిని అప్రతిష్ట పాల్జేసేలా ఘనంగా బురద చల్లవచ్చునని భావిస్తున్నారు. అందుకే కాదంబరి జెత్వానీ కేసులో ఆమెకు అనుకూలంగా వ్యవహారాలు నడుపుతున్నారు.

కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసులో ముంబాయికి వెళ్లి ఆమెను అరెస్టు చేసి తీసుకువచ్చిన పోలీసుల తీరు.. ఇప్పటికే అనుమానాస్పదంగా తయారైంది. కేసు నమోదు కాకముందే టికెట్లు కొనడం లాంటివి కొత్త విషయాలేం కాదు. చాలా కేసుల్లో ఇలా పోలీసులు చేస్తూనే ఉంటారు. కానీ.. ఇప్పుడు ప్రభుత్వం టార్గెట్ చేసిన వ్యక్తులు ఆ పనిచేసారు గనుక ఇరుక్కుపోయారనే వాదన ఒకటి ఉంది.

ఇప్పటికే ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, విశాల్ గున్నీ, కాంతిరాణా తాతా సస్పెండ్ అయ్యారు. సీఎంఓ నుంచే పురమాయింపులు వెళ్లాయని అంటున్నారు. సీఎంఓ నుంచి కొందరిని కేసులోకి తీసుకురావాలనే ప్రయత్నాలున్నట్టు తెలుస్తోంది. సజ్జల రామక్రిష్ణారెడ్డి ఈ వ్యవహారం వెనుక ఉన్నట్టుగా మీడియాలో ఇప్పటికే వచ్చింది. ఆయనను కూడా నిందితుడిగా చూపించడం వంటివి జరగాలంటే.. సీఐడీ కింద కేసులు ఉండడమే బెటర్ అనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.

మొత్తానికి పోలీసు శాఖ నమోదు చేస్తున్న కేసులను సీఐడీకి బదిలీ చేయడం ద్వారా వాటిలో కాస్త డోసేజీ పెంచి, తమకు కిట్టనివారినందరినీ కేసుల్లోకి తీసుకురానున్నట్టుగా కనిపిస్తోంది.

16 Replies to “వయా సీఐడీ: కక్ష సాధింపుల్లో ఇక జోరు పెరుగుతుందా?”

  1. అరెరే .. అవునా.. మరి జగన్ రెడ్డి హయాం లో సీఐడీ చంద్రబాబు ని స్కిల్ స్కాం లో ఇరికించినప్పుడు .. మనకు కక్ష సాధింపుల్లో జోరు, హోరు, హుషారు కనపడలేదా..?

    పోనీ కోర్ట్ సాక్ష్యాధారాలు అడిగితే.. రేపు, ఎల్లుండి అంటూ రెండు నెలలు వాయిదాలు వేసుకొంటూ వెళితే.. కోర్ట్ కి చిరాకుదెంగి .. చంద్రబాబు కి బెయిల్ ఇచ్చేసింది..

    సాక్ష్యాదారాలు లేకుండా అరెస్ట్ ఎందుకు చేశారు..?

    మనదాకా వచ్చేసరికి నీతులు చెపుతాం.. మనం మాత్రం దొమ్మరి గుడిసెల్లో దూరతాం..

  2. అచ్చు తప్పు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లో మాత్రం జోరు పెరుగుతుంది!!

  3. కనీసం cid అధికారులు అంటే చెప్పడానికి కూడా ఒక పద్ధతిగా వున్నారు ఇప్పుడు.

    అప్పట్లో వాళ్ళే నేరస్తుల లాగ వుండేవాళ్ళు చూడ్డానికి, అచ్చం ప్యాలస్ పులకేశి లాగ.

  4. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు జగన్ రెడ్డి బ్యాచ్ వారికి అనుచితంగా అనిపించలేదు. రాజ్యాంగ నైతిక విలువలకు నిలువునా పాతర వేసినప్పుడు జగన్ రెడ్డి బ్యాచ్ వారేమీ దాని గురించి కనీసంగానైనా చింతించలేదు. కానీ ఇప్పుడు తమదాకా వచ్చేసరికి గగ్గోలు పెడుతున్నారు.

  5. బు ర ద చల్లటం ఏంటి రా మ డ్డి లం జా కొ డ కా

    ఆ అమ్మాయిని అ క్ర మం గా అ రె స్టు చే సి ఇక్కడికి తీసుకొచ్చి నానా అవస్థలు పెట్టి మళ్ళీ మీ వ్య భి చా రి పే పర్లో ఆ అమ్మాయికి వ్య భి చా రు లతో కాంటాక్ట్ లు ఉన్నాయని రాశారు సి గ్గు లేదు చె త్త లం జా కొ డ కా

    ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా అ రె స్టు చేయటం అంటే ఎం త సి గ్గు మాలిన పని రా సి గ్గు లే ని వై సి పి లం జా కొ డ క ల్లా రా

Comments are closed.