ప్రభుత్వ మద్యం దుకాణాలు పోయి, ప్రైవేట్ దుకాణాలు ప్రత్యక్షమయ్యాయి. ఆదాయం వచ్చే వాటిని మాత్రం ఆలస్యం చేయకుండా చకచకా చేసుకుంటూ పోతారు. అయితే ప్రభుత్వ మద్యం దుకాణాలు ఇంత కాలం ఉపయోగించిన వస్తువులను కూడా వృథా పడేయకుండా సొమ్ము చేసుకోవచ్చనే సంగతిని ప్రభుత్వం విస్మరించడం విమర్శలకు దారి తీస్తోంది.
ప్రతి జిల్లాలో సరాసరి 100 దుకాణాలు చొప్పున, రాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా మద్యం దుకాణాలను వైసీపీ ప్రభుత్వమే నడిపింది. అధికార మార్పిడితో మద్యం పాలసీ కూడా మారింది. ప్రభుత్వ దుకాణాల్ని పక్కన పడేసి, ప్రైవేట్‌కు అప్పగించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు కొత్త దుకాణాలు కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత కాలం మద్యాన్ని అమ్మిన ప్రభుత్వ దుకాణాల్లోని ఎలక్ట్రికల్ గూడ్స్‌ను వృథాగా గోడౌన్లకు తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రిడ్జ్‌లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, విలువైన ట్యాబ్‌లు, స్కానర్లు తదితర వస్తువులున్నాయి. వీటిని గోడౌన్లకు తరలించడంతో తుప్పు పడుతాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
వీటిని వేలం వేయడం ద్వారా ఎంతోకొంత ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వారు సూచిస్తున్నారు. జనానికి తక్కువ ధరలో విలువైన పరికరాలను ఇచ్చినట్టు అవుతుందని ఎక్సైజ్ అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ గోడౌన్‌కు తరలిస్తే, రెండుమూడేళ్లకు వేలం వేయాలని అనుకున్నా ఎందుకూ పనికి రావని హెచ్చరిస్తున్నారు. కావున ప్రభుత్వం గోడౌన్లకు తరలించకుండా, వేలం ప్రక్రియ ద్వారా ఖజానాకు ఆదాయం సమకూర్చుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు.
Good suggestion..
Fritz laaa neneppugu beer temmanna fritz panicheyyatam ledu cooling ledu anebaadu maa govt shop vaadu
Call boy works 9989793850
Jagan – BANDS?????
Jagan & co have no shame. atleast in TDP, if people are unhappy leaders are hesitant to be wild.
ప్రియమైన రంగనాధ్ గారు, విష్ణు గారు, లోకనాథరావు గారు,
మీరు ఎంత చదువుకున్నవారైనా, ఎంత సాంస్కృతిక కుటుంబం నుండి వచ్చినవారైనా, కమ్మ మరియు కాపు కులాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం మీకు ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు. ద్వేషం ఏదీ ఎదుటివారికి మాత్రమే హాని కాదు, అది మీకు కూడా తీవ్రమైన నష్టం చేస్తుంది. ఈ ద్వేషం మీకు ఎటువంటి లాభం చేయదు; ఫలితంగా మీకు గుండెపోటులు, మానసిక సమస్యలు తప్ప మరేమీ రాకుండా చేస్తుంది. మీరు తలకెత్తుకునే ఈ ద్వేషం మీ శరీరానికి, మనసుకు అధిక ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది, దాని వల్ల మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.
మీరేమి సాధించాలనుకున్నా ఈ విధమైన కుల ద్వేషంతో మీరు ఏమీ సాధించలేరు. మీ జీవితంలో మీరు తగిలించుకునేది గుండెపోటులు, మానసిక సమస్యలు మాత్రమే. ఇతర కులాలను ద్వేషించడం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, మీ మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేస్తుంది. ఇది మీకు ఎప్పటికీ మంచిని ఇవ్వదు, పూర్తిగా నష్టాన్ని మాత్రమే తెస్తుంది. ఈ ద్వేషం ఎక్కడికీ తీసుకువెళ్లదు, ఏ దశలోనూ విజయాన్ని అందించదు.
కాబట్టి, మరోసారి ఆలోచించండి. ఈ ద్వేషం మీ జీవితాన్ని, ఆరోగ్యాన్ని హానికరంగా మార్చేస్తుంది.
Mundhu government kante ippudu vunna government madhyam shops ekkuva penchaaru andhra ni thagubothu lanu chesthunaru
Maa 11 Anna policy teliyeda
vc available 9380537747