దెబ్బకు చంద్రబాబు థింకింగ్ మారుతుందా?

“వేడుక చేసుకునే సమయం వచ్చేసింది.. ప్రశ్నల్లో ఘాటు పెంచుదాం.. ప్రతి ఎపిసోడ్ పండగలా చేద్దాం. దెబ్బకు థింకింగ్ మారి తీరాల” అంటూ ఘనంగా సీజన్-4 ప్రకటించారు. అంచనాలు మరిన్ని పెంచారు. కట్ చేస్తే, చంద్రబాబును…

“వేడుక చేసుకునే సమయం వచ్చేసింది.. ప్రశ్నల్లో ఘాటు పెంచుదాం.. ప్రతి ఎపిసోడ్ పండగలా చేద్దాం. దెబ్బకు థింకింగ్ మారి తీరాల” అంటూ ఘనంగా సీజన్-4 ప్రకటించారు. అంచనాలు మరిన్ని పెంచారు. కట్ చేస్తే, చంద్రబాబును ఇంకోసారి ఆహ్వానించారు.

అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అతిథుల కొరత ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ సీజన్-4 కొత్తగా ఉంటుందని ఊరించారు. మరి చంద్రబాబుతో చిట్ చాట్ చేసి అంత కొత్తదనం ఏం చూపిస్తారో చూడాలి.

నిజానికి సీజన్-4 అల్లు అర్జున్ ఇంటర్వ్యూలో మొదలవుతుందని అంతా అనుకున్నారు. ఆల్రెడీ బన్నీ ఈ కార్యక్రమంలో ఓసారి పాల్గొన్నప్పటికీ, పుష్ప-2 రిలీజ్ వేడిలో బన్నీతో సీజన్-4 షురూ చేస్తారని అంతా అనుకున్నారు.

అంతకంటే ముందు బాలయ్య-చిరంజీవి చిట్ చాట్ తో సీజన్-4 మొదలవుతుందని.. ప్రభాస్ ను ఇంకోసారి కూర్చోబెట్టే అవకాశం ఉందంటూ చాలా ఊహాగానాలు చెలరేగాయి. కానీ ఫైనల్ గా చంద్రబాబుకే ఫిక్స్ అయ్యారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనతో ప్రారంభిస్తే బాగుంటుందని భావించారేమో. అలాంటప్పుడు కనీసం బాబు-పవన్ ను కలిపి చేసినా కాస్త మజా ఉండేది.

చంద్రబాబుకు అన్ స్టాపబుల్ కొత్త కాదు. ఆల్రెడీ ఓసారి వచ్చారు. అప్పుడే బాలకృష్ణ-చంద్రబాబు చాలా మాట్లాడుకున్నారు. చంద్రబాబు నుంచి అంతకుమించి సమాచారం రాబట్టడం కష్టమనే విధంగా ఆ ఎపిసోడ్ ముగిసింది. మరి ఈసారి ఇంకేం రాబడదామని రప్పించారో తెలీదు.

“దెబ్బకు థింకింగ్ మారడం కాదు, మారి తీరుతుంది” అనేది ఈ సీజన్ క్యాప్షన్. మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ తర్వాత ఎవరి థింకింగ్ మారి తీరుతుందో చూడాలి.

17 Replies to “దెబ్బకు చంద్రబాబు థింకింగ్ మారుతుందా?”

  1. ఎక్కువ తిక్కల ఆలోచనలతో గ్రేట్ ఆంధ్ర ఎర్నలిస్టు లు సచ్చిపోతారేమో అనిపిస్తుంది… ఆడ షూస్తే జగన్ గాడు ప్రెస్ మీట్లలో కొండంత కామిడీ పీస్ అయిపోయాడు… చంద్రబాబు బాబు అనుభవాన్ని రంగరించి ఆచి తూచి మాట్లాడుతున్నాడు… ఏం కాదులే కుల భక్తులరా… కొన్నాళ్ళు సినిమాల మీద విమర్శలు రాసుకోండి.. మీరు షేప్పే రాజకీయాలు జనాల చెవులకు తలకు ఎక్కవు గానీ…

      1. Nippu, inventor of cell phone, creator of Covid vaccine, Laksha pusthakaalu chadivaanu, Che Guevara adarsam, NTR nunchi party ni rakshinchina chandrudu, Jayamu, Jayamu Chandranna.

        1. ఇవన్నీ ఒక ఎత్తు, పరిపాలన అంటే ఏంటో తెలీని దద్దమ్మ ఒక ఎత్తు, ఆ విషయంలో నెంబర్ వన్ స్టూడెంట్

          1. అవును రాజా, కొత్త పథకం కాకపోయినా రెగ్యులర్గా ఇచ్చే పథకమే అయినా బటన్ నొక్కిన ప్రతిసారీ పబ్లిక్ మీటింగ్ పెట్టి పవన్ పెండ్లి మీద, గిట్టని మీడియా మీద చెప్పే సొల్లు కబుర్లు కంటే టీవీ షో కి అటెండ్ అవటం దద్దమ్మ గాడి పబ్లిసిటీ పిచ్చికంటే చాలా తక్కువే.

            త*ల్లి చె*ల్లి బా*బా*యి హ*త్య*నీ అడ్డుపెట్టుకొని, తం*డ్రి లెగసి నీ వాడుకోనీ గెలవటం అందరికీ చేతకాదు లే

  2. తింగరోడిని పాలస్ కి పరిమితం చేశాక దెబ్బకి ఎంకటి థింకింగ్ మారిపోయింది..

Comments are closed.