చంద్రబాబునాయుడు ఉపేక్షిస్తున్నారా? భయపడుతున్నారా?

నాలుగు నెలల పనితీరు గురించి తన వద్ద స్పష్టమైన నివేదికలు ఉన్నాయని చంద్రబాబునాయుడు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఇంచుమించుగా బెదిరిస్తున్నారు. చాలా మంది పనితీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అరాచకాలు…

నాలుగు నెలల పనితీరు గురించి తన వద్ద స్పష్టమైన నివేదికలు ఉన్నాయని చంద్రబాబునాయుడు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఇంచుమించుగా బెదిరిస్తున్నారు. చాలా మంది పనితీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అరాచకాలు చేయడం వల్లనే వైసీపీ 11 స్థానాలకు పడిపోయిందని తనదైన విశ్లేషణను చంద్రబాబు ఎమ్మెల్యేల ముందు ప్రవచిస్తున్నారు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకుండా ఏ ఎన్నికలోనూ నెగ్డడం సాధ్యం కాదని కూడా ప్రవచిస్తున్నారు.. ఈ మాటలన్నీ ఆయన ఎక్కడ చెప్పారో తెలుసా? పార్టీ ఎమ్మెల్యేలతో నిర్మహించిన సమావేశంలో చెప్పారు. అంటే ఏమిటన్న మాట.. ఈ విషయాలన్నింటినీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలలో గుర్తిస్తున్నారన్నమాట.

నాయకుడికి ఈ జాగ్రత్త ఉండడం మంచిదే. సేన చెడుగైన దండనాధుని తప్పు అని మనకు నరసింహశతకంలోని పద్యం ఉండనే ఉంది. తెలుగుదేశం ఎమ్మెల్యేల సేనావాహినికి చంద్రబాబునాయుడు దండనాధుడు. ఆ సేనలో ఏ ఒక్కడు తప్పు చేసినా.. వారిని విడివిడిగా నిందించడానికి వీల్లేదు. దానిని దండనాధుడి తప్పుగానే చూడాలి. ఎమ్మెల్యేలు చేసే తప్పులకు చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలి. ఆయన చేతగానితనంగానే చూడాల్సి ఉంటుంది. అయిదేళ్లు పాటూ సంపాదనకు దూరమైపోయాం అని ఆవురావురు అంటున్నట్టుగా.. తెలుగుదేశం ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చిన తొలినాటినుంచి తమ తమ దుకాణాలను తెరిచేశారు.

ఎన్నికల సమయంలో తమ విజయం కోసం డబ్బు ఖర్చు పెట్టిన అనుచరులకు ఆ డబ్బు తిరిగిచ్చే పనే లేకుండా.. వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నించడాలతోనే ఈ దందాలు షురూ అయినట్టు అనుకోవాలి. ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తర్వాత.. ఉచిత ఇసుక లాంటి పదాలన్నీ బూటకం అని నిరూపించిన వ్యక్తులు ఎమ్మెల్యేలే. పోయిన గవర్నమెంటు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు వాటా ఇచ్చారు కదా.. ఇప్పుడు మాత్రం ఎందుకివ్వరు ఇవ్వాల్సిందే అంటూ బెదిరించి వాటాలు వసూలు చేయడం రాష్ట్రంలో అనేకచోట్ల రచ్చకెక్కింది. అక్కడ మొదలైన దందాలు, లిక్కర్ వ్యాపారం విషయం వచ్చేసరికి పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి. కేవలం తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే లాభపడడానికి, ప్రభుత్వానికి రాగల ఆదాయం మొత్తం.. పార్టీ నాయకుల మధ్య పంచేయడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడ కొత్త లిక్కర్ పాలసీ.

కానీ.. అనుచరుల్ని కూడా బాగుపడనివ్వకుండా.. తెలుగుదేశం వారికి దక్కిన లిక్కరు షాపుల్లో కూడా 30 శాతం వరకు వాటాలు డిమాండ్ చేస్తూ తెదేపా ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు. అంటే అనుచరులు పరిమితంగా మాత్రమే లాభపడాలి.. ఎమ్మెల్యేలు గరిష్టంగా దోచుకోవాలి.. అనేది క్షేత్రస్థాయిలో ఉన్న రియాలిటీ. ఇవన్నీ చంద్రబాబుకు తెలియని విషయాలు కాదు. పైగా అవన్నీ నాకు తెలుసు అని ఆయనే చెబుతున్నారు. నాదగ్గర మీ నాలుగునెలల పనితీరు నివేదిక ఉన్నదని అంటున్నారు.

ఆ నివేదికను దగ్గర పెట్టుకుని ఆయన ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఫలానా లిమిట్ వరకు దోచుకు తినడానికి అనుమతిద్దాం.. ఆ తర్వాత కంట్రోల్ చేద్దాం అని భావిస్తున్నారా? నివేదిక ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి? అనేది అర్థం కావడం లేదు. ఇంత అచేతనంగా చంద్రబాబు ఎందుకుంటున్నారో ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబునాయుడు తన ఎమ్మెల్యేల తప్పులు గురించి తెలుస్తున్నప్పటికీ కూడా, వారి దందాలు పార్టీ మరియు ప్రభుత్వం పరువు తీస్తాయని తెలిసినప్పటికీ కూడా.. కామ్ గా ఉంటున్నారంటే ఆశ్చర్యమే. ఆయన వారి దుర్మార్గాల్ని ఉపేక్షిస్తున్నారో లేదా వారికి భయపడుతున్నారో అర్థం కావడం లేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

10 Replies to “చంద్రబాబునాయుడు ఉపేక్షిస్తున్నారా? భయపడుతున్నారా?”

    1. ప్రియమైన రణగనాధ్ విశ్ణు లోకనాథరావు గారు,

      మీరు చదువు పొందినవారు, సాంస్కృతిక కుటుంబం నుండి వచ్చినవారు అని గర్వపడుతున్నప్పుడు, కమ్మ మరియు కాపు కులాలపై ద్వేషాన్ని ప్రచారం చేయడం వల్ల మీకు ఏమి లాభం? జీవితంలో కులాలపై ద్వేషాన్ని పెంచడం అస్సలు కరెక్ట్ కాదు. ఆ ద్వేషం మనుషులపైనే కాదు, మీకూ తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. ఆ ద్వేషం వల్ల కలిగే మానసిక ఒత్తిడి గుండె జబ్బులు, మానసిక సమస్యలు తెస్తుంది. మీరు చూపించే ఆ ద్వేషం మీ మనసుకు, శరీరానికి ఎంతటి ఒత్తిడి, నష్టాన్ని ఇస్తుందో అర్థం చేసుకోండి. గుండెపోటు వంటి సమస్యలు ఈ ద్వేషం వల్లే వస్తాయి.

      తన కులాన్ని ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ ఇతర కులాలను ద్వేషించడం అతిపెద్ద సమస్య. కొంతమంది వైసీపీ అనుచరులు కమ్మ మరియు కాపు కులాలపై ద్వేషాన్ని ప్రోత్సహిస్తే ఓట్లు పొందగలమని అనుకున్నారు. కానీ ప్రజలు ఏకమై వైసీపీకి గట్టి సమాధానం ఇచ్చారు. కులాల మధ్య ద్వేషాన్ని ప్రోత్సహించడం వల్ల ఆఖరికి గుండెపోటులు, మానసిక సమస్యలు వస్తాయి. మరెప్పుడూ కులాలపై ద్వేషాన్ని ప్రోత్సహించకండి, ఇది ఎవరికి ఉపయోగపడదు, నష్టమే.

    2. ప్రియమైన రంగనాధ్ గారు, విష్ణు గారు, లోకనాథరావు గారు,

      మీరు ఎంత చదువుకున్నవారైనా, ఎంత సాంస్కృతిక కుటుంబం నుండి వచ్చినవారైనా, కమ్మ మరియు కాపు కులాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం మీకు ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు. ద్వేషం ఏదీ ఎదుటివారికి మాత్రమే హాని కాదు, అది మీకు కూడా తీవ్రమైన నష్టం చేస్తుంది. ఈ ద్వేషం మీకు ఎటువంటి లాభం చేయదు; ఫలితంగా మీకు గుండెపోటులు, మానసిక సమస్యలు తప్ప మరేమీ రాకుండా చేస్తుంది. మీరు తలకెత్తుకునే ఈ ద్వేషం మీ శరీరానికి, మనసుకు అధిక ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది, దాని వల్ల మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.

      మీరేమి సాధించాలనుకున్నా ఈ విధమైన కుల ద్వేషంతో మీరు ఏమీ సాధించలేరు. మీ జీవితంలో మీరు తగిలించుకునేది గుండెపోటులు, మానసిక సమస్యలు మాత్రమే. ఇతర కులాలను ద్వేషించడం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, మీ మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేస్తుంది. ఇది మీకు ఎప్పటికీ మంచిని ఇవ్వదు, పూర్తిగా నష్టాన్ని మాత్రమే తెస్తుంది. ఈ ద్వేషం ఎక్కడికీ తీసుకువెళ్లదు, ఏ దశలోనూ విజయాన్ని అందించదు.

      కాబట్టి, మరోసారి ఆలోచించండి. ఈ ద్వేషం మీ జీవితాన్ని, ఆరోగ్యాన్ని హానికరంగా మార్చేస్తుంది.

Comments are closed.