‘పుష్ప-2’కు సంబంధించి గ్రౌండ్ ఈవెంట్ చాలా పెద్దగా ప్లాన్ చేశామని ప్రకటించాడు నిర్మాత. త్వరలోనే ఆ తేదీలన్నీ వెల్లడిస్తామన్నాడు. కట్ చేస్తే, ఇప్పుడు హైదరాబాద్ లో గ్రౌండ్ ఈవెంట్ చేయలేని పరిస్థితి.
హైదరాబాద్ సిటీలో నెల రోజుల పాటు పోలీసులు ఆంక్షలు విధించారు. ఆందోళనలు, అశాంతి రేకెత్తించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని.. అందుకే సిటీలో నెల రోజుల పాటు సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.
దీంతో ‘పుష్ప-2’ గ్రౌండ్ ఈవెంట్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డిసెంబర్ 5న సినిమా థియేటర్లలోకి వస్తోంది. నవంబర్ మొత్తం భారీ ప్రమోషన్స్ తో హోరెత్తించాలని అనుకున్నారు. కానీ నవంబర్ 28 వరకు సిటీలో ఎలాంటి ఈవెంట్స్ పెట్టడానికి వీల్లేకుండా పోయింది.
ఇప్పుడు ‘పుష్ప-2’ ముందు రెండు ఆప్షన్లున్నాయి. ఒకటి నవంబర్ 28 తర్వాత హైదరాబాద్ లో ఈవెంట్ పెట్టుకోవాలి. అంతకంటే ముందే పెట్టాలనుకుంటే, హైదరాబాద్ బయట ఈవెంట్ పెట్టుకోవాలి. త్వరలోనే మేకర్స్ దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు.
పెద్ద సినిమాలకు గ్రౌండ్ ఈవెంట్స్ మిస్సయితే సినిమాపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చు కానీ అభిమానులు మాత్రం హర్ట్ అవుతారు. మొన్నటికిమొన్న ‘దేవర’ విషయంలో అదే జరిగింది. చిన్న వేదికపై పెద్ద వేడుక చేయాలని చూడ్డంతో మొదటికే మోసం వచ్చింది. ఆ టైమ్ లోనే ‘పుష్ప-2’ ఈవెంట్ కు అన్ని రకాల ముందుజాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని, భారీగా ఈవెంట్ చేస్తామని నిర్మాత ప్రకటించాడు. కానీ ఇప్పుడు సిటీలో ఆంక్షలు వెలువడ్డాయి.
Call boy jobs available 9989793850
nuv happy ga GA!!!!!!!!!
vc available 9380537747
ఎలాగూ థియేటర్ లో అస్సల్ చూసేదేలే.. ఇక ఫంక్షన్ ఎందుకు