ప్రామిస్ చేశాను.. పెళ్లి చేసుకున్నాను

లావణ్య త్రిపాఠితో ప్రేమ, పెళ్లికి సంబంధించి మరోసారి రియాక్ట్ అయ్యాడు వరుణ్ తేజ్. లావణ్య విషయంలో రెండు ప్రామిస్ లు చేశానని, అందులో ఒకటి నిలబెట్టుకున్నానని, ఒకటి మాత్రం నెరవేర్చలేకపోయానని వెల్లడించాడు. Advertisement “లావణ్యకు…

లావణ్య త్రిపాఠితో ప్రేమ, పెళ్లికి సంబంధించి మరోసారి రియాక్ట్ అయ్యాడు వరుణ్ తేజ్. లావణ్య విషయంలో రెండు ప్రామిస్ లు చేశానని, అందులో ఒకటి నిలబెట్టుకున్నానని, ఒకటి మాత్రం నెరవేర్చలేకపోయానని వెల్లడించాడు.

“లావణ్యకు నేను 2 ప్రామిస్ లు చేశాను. పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాను, మాటిచ్చినట్టుగానే పెళ్లి చేసుకున్నాను. ప్రేమ విషయాన్ని రెండేళ్ల ముందే ఇంట్లో చెబుతానన్నాను. ఆ మాట మాత్రం నిలబెట్టుకోలేకపోయాను. ఏడాది కిందటే చెప్పాను.”

మట్కా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు తన భార్యను తీసుకెళ్లాడు వరుణ్ తేజ్. ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని కూడా బయటపెట్టాడు. ఇంట్లో వరుణ్ కోసం లావణ్య వంట చేస్తుందట. ఆమె సాంబార్ చాలా బాగా పెడుతుందంట.

ఇక మట్కా సినిమాకు సంబంధించి కూడా వరుణ్ తేజ్ ఓ ప్రామిస్ చేశాడు. కచ్చితంగా ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని, తనది ప్రామిస్ అంటూ ఓపెన్ గా ప్రకటించాడు.

4 Replies to “ప్రామిస్ చేశాను.. పెళ్లి చేసుకున్నాను”

Comments are closed.