టీ టైమ్ కు ఓజీ

పవన్ కళ్యాణ్- సుజిత్ కాంబినేషన్ లో తయారవుతున్న ఓజీ సినిమాకు బోలెడు క్రేజ్ వుంది. అది వాస్తవం. దేవర హిట్ తరువాత 70 కోట్ల రేంజ్‌లో అంధ్ర (సీడెడ్ కాకుండా ) రేటు చెప్పారు.…

పవన్ కళ్యాణ్- సుజిత్ కాంబినేషన్ లో తయారవుతున్న ఓజీ సినిమాకు బోలెడు క్రేజ్ వుంది. అది వాస్తవం. దేవర హిట్ తరువాత 70 కోట్ల రేంజ్‌లో అంధ్ర (సీడెడ్ కాకుండా ) రేటు చెప్పారు. కానీ చివరికి 65 కోట్లు(ఇన్ క్లూడింగ్ జీఎస్టీ) కి ఫైనల్ చేసారు నిర్మాత దానయ్య. దానికి కూడా సినిమా వ్యాపారంలో వుండే బయ్యర్లు రెడీ అంటున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే జ‌నసేన లీడర్లు తమకే ఇవ్వాలని పట్టుపడుతున్నారు.

వైజాగ్, ఈస్ట్, నెల్లూరు, ఇలా ప్రతి చోటా లోకల్ బయ్యర్లను పక్కన పెట్టి, జ‌నసేన లీడర్లు ముందుకు వచ్చి తమకే సినిమా ఇవ్వాలని పట్టుపడుతున్నారు. పైగా ఒక్కో ఏరియాకు ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారట. ఈస్ట్ గోదావరి తనకు తప్ప మరెవరికీ ఇవ్వకూడదని, ఎంపీ, టీ టైమ్ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే విశాఖ తనకే కావాలని ఓ జ‌నసేన కీలక నేత పట్టుపడుతున్నారట.

ఇవన్నీ చూసి రెగ్యులర్ గా సినిమా వ్యాపారంలో వుండే జ‌నాలు గోల పెడుతున్నారు. ఇదేంటీ ఈ పోటీ అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇంకా ఎవరికీ ఏ హక్కులు ఖరారు చేయలేదు. సినిమాను మార్చిలోనే విడుదల చేస్తారని, హరి హర వీరమల్లు సినిమా అ తరువాత వుంటుందని టాలీవుడ్ టాక్ కూడా.

9 Replies to “టీ టైమ్ కు ఓజీ”

  1. అది వ్యాపారం రా అయ్యా, ఎవడు ఎక్కువ ఇస్తే వాడికే ఇస్తారు. ఇందులో కొత్త పాత ప్రస్తావన కు తావే లేదు. అయినా దీన్ని కూడా నేరంగా రాస్తున్నావూ చూడు. నీలాంటి బోకు సన్నాసి వెదవల వల్లనే అసలు సమస్యంతా

Comments are closed.