కడప ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డికి ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారు. దీంతో పాటు కేబినెట్ హోదా కూడా కల్పించారు. మొదటి సారి ఎమ్మెల్యేగా మాధవీరెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆమెకు చంద్రబాబు సర్కార్ ప్రాధాన్యం ఇవ్వడం ఉమ్మడి కడప జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులకు ఏ మాత్రం ఇష్టం లేదు.
తమకు పదవులు రానందుకంటే, మాధవీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఏంటనే కోపం కడప టీడీపీ నాయకుల్లో వుంది. అసలే మాధవీరెడ్డి హడావుడి ఎక్కువ చేస్తుంటారు. ఇప్పుడు కేబినెట్ హోదా కూడా ఇస్తే, ఇక ఆమెను కంట్రోల్ చేయడం సాధ్యం కాదనే అభిప్రాయం టీడీపీ నేతల్లో వుంది. మాధవీరెడ్డికి సొంత పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యేతోనే సఖ్యత లేదని సమాచారం.
ఎలాగైనా ఆమెను అదుపులో వుంచాలని టీడీపీ నాయకులు వ్యూహాలు రచిస్తుంటే, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మాత్రం ఆమెను అందలం ఎక్కిస్తున్నారని మండిపడుతున్నారు.
ఇటీవల కాలంలో మాధవీరెడ్డి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కడప టీడీపీ నగర అధ్యక్షుడు శివకొండారెడ్డిపై దాడి ఘటనలో వేళ్లన్నీ ఆమె వైపే చూపుతున్నాయని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. అలాగే కడప నగర పాలక సమావేశంలో కుర్చీ విషయమై మాధవీరెడ్డి హడావుడి అంతాఇంతా కాదు. బహుశా ఈ అర్హతలే ఆమెకు ప్రాధాన్యం ఇచ్చేలా చేశాయనే వాదన లేకపోలేదు. ఏది ఏమైనా మాధవీకి ప్రాధాన్యం ఇవ్వడంపై సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు.
ఏమి రెడ్డి సీమ పౌరుషం అడ్డొచ్చిందా ఒక ఆడబిడ్డ కి కేబినెట్ హోదా కల్పించినందుకు.
E k o j ja reddy ki vattalu vanukutunnai…anduke TDP perumeeda article …
real reddy vs teda 11 reddy
vc available 9380537747