ఇంట గెలవలేకపోతున్న భూమన!

భూమన కరుణాకర్ రెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు దక్కాయి. కీలకమైన ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా కావడం.. 2019 ఎన్నికల్లో కుప్పం మినహా క్లీన్ స్వీప్ చేసిన…

భూమన కరుణాకర్ రెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు దక్కాయి. కీలకమైన ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా కావడం.. 2019 ఎన్నికల్లో కుప్పం మినహా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో 2024 కెల్లా కేవలం రెండు స్థానాలకు బలం పడిపోయిన నేపథ్యంలో.. కీలక బాధ్యతలను భూమన చేతిలోపెట్టారు జగన్మోహన్ రెడ్డి.

అదే సమయంలో.. ఆ స్థానంలో ఇటీవలే నియమితులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తప్పించి మరీ, భూమనకు పదవి కట్టబెట్టడం విశేషం. ఇంత జరుగుతుండగా భూమన కరుణాకర రెడ్డి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. గానీ.. తన సొంత నియోజకవర్గమైన తిరుపతి పరిస్థితులు చూసుకోలేకపోతున్నారని.. ఇంటగెలిచి రచ్చగెలవాలనే సిద్ధాంతాన్ని మర్చిపోతున్నారని పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తిరుపతి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులు వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత అభినయ్ రెడ్డి అంత చురుగ్గా కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. కార్పొరేటర్లు కొందరు ఎన్డీయే కూటమి పార్టీల్లో చేరడానికి తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.

భూమన ఫోటోను ఉంగారాల్లో, లాకెట్లో వేసుకుని తిరిగిన డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కూడా తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. భూమన కుడిభుజంగా వ్యవహరించిన దొడ్డారెడ్డి సిద్దారెడ్డి కూడా పార్టీ మారుతారనే పుకార్లున్నాయి.

అంతకంటె ట్విస్టు ఏంటంటే.. ‘తిరుపతి రాజకీయం రివర్స్ అయిపోయింది. కాపాడుకోవాల్సిన వాళ్లు సైలెంట్ అయిపోయారు. కాపాడాల్సిన వారు కూడా మౌనం దాల్చారు’ అంటూ కార్పొరేటర్ ఎస్కే బాబు ఫేస్ బుక్ లో పోస్టు చేసి.. కొన్ని గంటల తర్వాత ఆ పోస్టును తొలగించారు. ఈలోగా ఆ పోస్టు వైరల్ అయిపోయింది. అయితే.. భూమన సన్నిహితుడు నచ్చజెప్పడం వల్లనే ఎస్కే బాబు ఆ పోస్టును తొలగించినట్టుగా తెలుస్తోంది.

ఈ వ్యవహారాలను అన్నింటినీ స్థూలంగా గమనించినప్పుడు.. భూమన కరుణాకరరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ సారథిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా.. జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన జాగ్రత్తపడి ఇంటగెలిచి రచ్చగెలిచే సూత్రం పాటిస్తే బెటర్ అని అంటున్నారు.

9 Replies to “ఇంట గెలవలేకపోతున్న భూమన!”

  1. అంటే..ఈయనే పిసుక్కోలేక నలుపుకుంటుంటే కొడుకెళ్లి ఎవరెస్ట్ మీద జండా రెపరెప లాడిస్తున్నాడా..?

  2. Orey jaganu neevu uddha aa thackerey gaadu maararu gaaka maararu.. .mee pakkana AA chamchagallu unnantha varaku anthe sangathulu.. ee bhumana gaadu rice bag gaadu. Vaadi family ki nee Abba raja teddy vaadiki enti AA sambhandam

  3. పాస్టర్ గారు తిరుపతి లో శ్రీవారి భక్తులు నీ ఎంత మందిని మతం మార్చి వాటికన్ గొర్రె బిడ్డ లాగ మార్చాలో టార్గెట్ ఇచ్చారు అంట .

    మారు మనస్సు పొందిన ఒక్కో గొర్రె బిడ్డకి 100 డాలర్లు వన్ టైమ్ కమీషన్.

    పూర్తిగా గొర్రె బిడ్డగా మారిన తర్వాత వాళ్ళు ఇచ్చే దశమ భాగాల్లో తర్వాత జీవితము మొత్తం 1 % కమీషన్.

    ఆ టార్గెట్ కోసం కష్టపడుతున్నారు వాటికన్ రెడ్డి గారు.

Comments are closed.