ఆమెకు పదవి ఉందా లేదా?

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో కీలక మహిళా నాయకురాలిగా ఉన్న పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి నామినేటెడ్ పదవి అయితే దక్కలేదు. పక్క నియోజకవర్గం అరకు నుంచి ఇద్దరికి ఆ చాన్స్ లభించింది.…

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో కీలక మహిళా నాయకురాలిగా ఉన్న పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి నామినేటెడ్ పదవి అయితే దక్కలేదు. పక్క నియోజకవర్గం అరకు నుంచి ఇద్దరికి ఆ చాన్స్ లభించింది. మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కి జీసీసీ చైర్మన్ పదవిని ఇచ్చారు.

మరో ముఖ్య నేత దొన్ను దొరకు ఆర్టీసీ జోనల్ చైర్మన్ పదవి లభించింది. ఈ ఇద్దరికీ పార్టీ తరఫున న్యాయం జరిగిందని అంటున్నారు. అయితే పార్టీలో ముందు నుంచి ఉన్న గిడ్డి ఈశ్వరికి పదవి ఇంకా దక్కలేదని ఆమె వర్గంలో తర్కించుకుంటున్నారు.

గిడ్డి ఈశ్వరి పార్టీకి బలమైన గొంతుకగా నిలుస్తూ వస్తున్నారు. ఆమె 2014లో వైసీపీ నుంచి గెలిచారు. మూడేళ్ళు తిరగకుండానే 2017లో సైకిలెక్కేశారు. అప్పట్లో ఆమెకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. అయితే అరకు ఎమ్మెల్యే కిడార్ సర్వేశ్వరరావును మావోలు హత్య చేయడంతో ఆయన కుమారుడు శ్రవణ్ కుమార్ కి మంత్రి పదవిని ఇచ్చారు.

ఇపుడు కూడా కిడారి ఫ్యామిలీకి న్యాయం జరిగింది. అంతే కాదు 2019 దాకా వైసీపీలో ఉంటూ టికెట్ దక్కలేదని రెబెల్ గా పోటీ చేసిన దొన్ను దొర తరువాత కాలంలో టీడీపీలో చేరారు. ఆయనకు అరకు టికెట్ ఇవ్వనందుకు నామినేటెడ్ పదవిని ఇచ్చారు. ఆ విధంగా అరకులో ఇద్దరు టీడీపీ నేతలకు మంచి పోస్టులే దక్కాయని అంటున్నారు.

కానీ పాడేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గిడ్డి ఈశ్వరికి కానీ మాజీ మంత్రి మణికుమారికి కానీ నామినేటెడ్ పదవులలు ఇవ్వలేదు. దాంతో చివరి విడతలో అయినా చాన్స్ ఉందా అని అనుచరులు ఆశగా చూస్తున్నారు.

4 Replies to “ఆమెకు పదవి ఉందా లేదా?”

Comments are closed.