ఆదిమూలంపై టీడీపీ శీత‌క‌న్ను!

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ శీత‌క‌న్ను వేసింద‌ని ఆయ‌న అభిమానులు అంటున్నారు. లైంగిక ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆదిమూలంపై టీడీపీ స‌స్పెన్ష‌న్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత బాధిత…

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ శీత‌క‌న్ను వేసింద‌ని ఆయ‌న అభిమానులు అంటున్నారు. లైంగిక ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆదిమూలంపై టీడీపీ స‌స్పెన్ష‌న్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత బాధిత టీడీపీ మండ‌ల నాయ‌కురాలు హైకోర్టులో ఆదిమూలంపై తాను నిరాధార ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టు అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు.

దీంతో ఆదిమూలంపై కేసును హైకోర్టు కొట్టివేసింది. అనంత‌రం తిరుప‌తి ఈస్ట్ పోలీస్‌స్టేష‌న్‌లో ఆదిమూలంపై న‌మోదైన లైంగిక వేధింపుల కేసు ఎత్తివేశారు. ఆ త‌ర్వాత ప‌లుమార్లు ఆదిమూలం సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌ను కూడా క‌లిసొచ్చారు. త్వ‌ర‌లో స‌స్పెన్ష‌న్‌ను తొల‌గిస్తామ‌ని వాళ్లిద్ద‌రు హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

అయిన‌ప్ప‌టికీ ఆదిమూలంపై స‌స్పెన్ష‌న్ వేటు తొల‌గ‌లేదు. మ‌రోవైపు ఎమ్మెల్యేగా ఆదిమూలం అధికారిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. స‌త్య‌వేడు టీడీపీలో రెండు వ‌ర్గాల‌య్యాయి. ఎమ్మెల్యే, ఆయ‌న‌కు వ్య‌తిరేక వ‌ర్గీయులు పోటాపోటీగా అధికారిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆదిమూలంపై స‌స్పెన్ష‌న్ ఎత్తివేయొద్ద‌ని స‌త్య‌వేడుకు చెందిన టీడీపీ నాయ‌కులు చంద్ర‌బాబుపై ఒత్తిడి తెస్తున్నార‌ని తెలిసింది. అందుకే ఆదిమూలంపై నిర్ణ‌యం తీసుకోవ‌డంలో జాప్యం అవుతోంద‌ని సమాచారం. అయితే తానింకా అధికార పార్టీ ఎమ్మెల్యేగా గుర్తింపు పొంద‌క పోవ‌డంతో అధికారులు త‌న మాట విన‌డం లేద‌ని ఆదిమూలం వాపోతున్నారు.

5 Replies to “ఆదిమూలంపై టీడీపీ శీత‌క‌న్ను!”

Comments are closed.