ఆ నటులంతా ఎక్కడ పుష్పా?

పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూసిన వాళ్లు గమనించారో లేదో ఒక విశేషం వుంది. బన్నీ వచ్చారు. శ్రీలీల, రష్మిక, అనసూయ వచ్చారు. మరి మిగిలిన నటులేరీ? పుష్ప 2 లో…

పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూసిన వాళ్లు గమనించారో లేదో ఒక విశేషం వుంది. బన్నీ వచ్చారు. శ్రీలీల, రష్మిక, అనసూయ వచ్చారు. మరి మిగిలిన నటులేరీ? పుష్ప 2 లో బోలెడు మంది నటులు వున్నారు. కాస్త పేరున్న వారే వున్నారు. కానీ వారంతా ఎందుకు ఫంక్షన్ కు రాలేదు?

రావు రమేష్, సునీల్, ఫాజిల్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, ధనుంజయ, అజయ్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్ ఇలా బోలెడు మంది నటులు వున్నారు. వీరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఎందుకు పుష్ప 2 ప్రీ రిలీజ్ మీట్ కు రాలేదు. రాకుండా ఎందుకు వున్నారు?

పుష్ప 2 లాంటి సినిమాలో తాము నటించాము అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు కదా.

అలాంటి ఫంక్షన్ కు రావాలని కచ్చితంగా అనుకుంటారు కదా.

రాకుండా వుండరు కదా?

మరి ఎందుకు రాలేదు?

నిర్మాత పిలవకుండా అయితే వుండరు. పిలవలేదు అంటే ఏదో విషయం వుండాలి.

సింపుల్ ఆన్సర్ వస్తుంది ఆలోచిస్తే.

టోటల్ గా జనాల దృష్టి అంతా హీరో బన్నీ మీదే వుండాలని ఇలా చేసారా?

అంతకు మించిన రీజన్ అయితే బుర్ర చించుకున్నా రాదు కాక రాదు.

13 Replies to “ఆ నటులంతా ఎక్కడ పుష్పా?”

  1. ఎవరు వచ్చినా రాకున్నా… ఏ సినిమా ఫంక్షన్ కి అయినా హీరో నే మెయిన్ ఫోకస్ అవుతారు… తరువాత హీరోయిన్… డైరెక్టర్… టెక్నీషియన్స్ etc. ఇది బన్నీ గారి కి మాత్రమే స్పెషల్ ఏమీ కాదు. ఒకవేళ బన్నీ గారు నేను మాత్రమే హైలైట్ అవ్వాలి అనుకుంటే అంతకన్నా సంకుచిత మనస్తత్వం ఇంకేమీ ఉండదు

  2. అలా రావాలి అంటే బోడి గుండుతోనో, బట్టతలతోనే, కాలు-చేయి వంకరతోనో, ఇతర అవలక్షణాలతోనో రావాలి. కథానాయకుడికన్నా అందంగా, హుందాగా ఎవరూ కనబడకూడదు.

  3. అక్కడ అనసూయ వచ్చినందుకే ఫోకస్ మొత్తం ఆమె మీదకి మళ్ళింది.. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన ఔతుంది…

Comments are closed.