సన్యాసం అన్నారే.. వాసన వదలబుద్ధి కాలేదా కాళీ!

అవకాశవాదం అనేది ఒక్కోసారి ఒక్కో రూపంలోకి మారుతూ ఉంటుంది. ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా.. అవకాశవాదం కూడా రకరకాల చిన్నెలు చూపిస్తుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల కాళీకృష్ణ…

అవకాశవాదం అనేది ఒక్కోసారి ఒక్కో రూపంలోకి మారుతూ ఉంటుంది. ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా.. అవకాశవాదం కూడా రకరకాల చిన్నెలు చూపిస్తుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ వ్యవహారం కూడా ఈ విషయాన్నే నిరూపిస్తున్నది. ఆయన తాజాగా తెలుగుదేశంలో చేరబోతుండడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు.. రాజీనామా చేసినప్పుడు.. రాజకీయాలనుంచే పూర్తిగా పక్కకు తప్పుకుంటున్నట్టుగా సన్యాసం ప్రకటించిన ఆయన ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ఆశ్రయంలోకి వెళుతుండడం చూసి పలువురు ఆశ్చర్య పోతున్నారు.

ఆళ్ల నానిగా అందరికీ తెలిసిన కాళీకృష్ణ శ్రీనివాస్ ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ సర్కారులో మంత్రిగానూ, డిప్యూటీ ముఖ్యమంత్రిగానూ చేశారు. జగన్ పాలన సాగిన రోజుల్లో రకరకాల సమీకరణల కారణంగా ఆయనకు అవకాశాలు బాగానే కలిసివచ్చాయి. అన్నింటినీ బాగానే అందిపుచ్చుకున్నారు. అధికార వైభవాన్ని అనుభవించారు. తీరా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత.. ఒక్కసారిగా పార్టీని వదలివెళ్లిపోయిన అనేకమంది అవకాశవాదుల్లో తాను కూడా ఒకడిగా కాళీకృష్ణ కూడా ముద్రపడ్డారు.

ఆయన పూర్తిగా రాజకీయాలనుంచే తప్పుకోదలచుకుంటున్నట్టు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భంలో ప్రకటించారు. పార్టీని వీడిపోయినప్పటికీ.. ఆయన మీద నిన్నటిదాకా వైసీపీ వర్గాల్లో కొంత సానుభూతి ఉండేది. కానీ ఆయన రాజకీయ సన్యాసం ముసుగులో కొంత గ్యాప్ తీసుకుని.. ఇప్పుడు ఎంచక్కా అధికార తెలుగుదేశం పంచన చేరుతుండడం వైసీపీ కార్యకర్తలకు మింగుడుపడడం లేదు. అవకాశవాదానికి పరాకాష్టగా వారు దీనిని భావిస్తున్నారు.

అయితే కాళీకృష్ణ శ్రీనివాస్ ను తమ పార్టీలో చేర్చుకోవడానికి.. చంద్రబాబు పెద్ద మంత్రాగమే నడిపినట్టుగా తెలుస్తోంది. కాళీకి సన్నిహితుడైన తమ పార్టీలోని విజయనగరం జిల్లా నేతను ప్రయోగించి ప్రలోభపెట్టినట్టుగా సమాచారం. ఆళ్ల నాని తమ పార్టీలో ఉంటే.. ముందు ముందు జగన్ పాలన కాలంలో జరిగిన నిర్ణయాల గురించి అప్పటి మంత్రి హోదాలో.. జగన్ మీద ఇంకా ఎక్కువ విమర్శలు చేయించవచ్చునని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

సెకి ఒప్పందం విషయంలో జనసేన నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జగన్ మీద అడ్డగోలు విమర్శలు చేసినట్టుగానే.. తమ పార్టీ నుంచి మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రితో జగన్ మీద విమర్శలు చేయిస్తే మైలేజీ వస్తుందని బాబు ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

33 Replies to “సన్యాసం అన్నారే.. వాసన వదలబుద్ధి కాలేదా కాళీ!”

  1. మొన్నటి వరకూ ఎవరన్నా TDP వదిలెస్తె.. TDP కాలీ అవుతుంది. చంద్రబాబు మళ్ళి అదిక్కరం లొకి వస్తాడు అన్న నమ్మకం లెదు అని రాసాడు.

    ఇప్పుడు ఇక జగన్ మీద నమ్మకం లెక Y.-.C.-.P అవుతుంటె….. ఊసరవల్లి.., అవకాశవాదం.., రంగులు మార్చటం.., సన్యాసం.., వాసలలు… ఇలా రాస్తున్నాడు

  2. Who will stay in a chillara party set up to become CM. He was just waiting and said few things as otherwise J may have committed suicide he thought and Mohamatam. Pawan already told that 10 more yrs CBN as CM.No body will stay in crmnl party as shar is better alternative than him as she is much much better speaker and honest to boot

  3. Asalu neeku great Andhra ane Peru enduku raa? YCP media ano, J channel ano pettukovachu kada. Nee paniki Malina raathalu chadivi , Mee meeda jaali padalo, leka laagi tannaalo artham kaavatam ledu.

  4. Congress party అధికారం లో వున్నప్పుడు జగన్ ఎన్ని వేల కోట్లు సంపాదించాడు, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ నె నామ రూపాలు లేకుండా చేశాడు. ఇది నమ్మక ద్రోహం అంటే. వైసిపి వాళ్ళు అలా మాట్లాడటం తప్పు.

  5. కాంగ్రెస్ లో ఉన్నపుడు అవకాశాలు వొచ్చాయి కదా .. అయినా వేరే పార్టీ ఎందుకు పెట్టుకున్నారు .. అది అవకాశం వాదం కాదు కదా .. మరి ఇదెందుకు అయింది ?

  6. అవును గుడివాడ నాని, గన్నవరం వంశీ ని మా అన్నయ్య వాడుకున్న దాని గురించి కూడా రాస్తే బాగుండేది కదా

  7. Sontha Thandri ni 2 sarlu CM ni , Ninnu ni family ni MP lanu , Mla lanu Chesina Congress party ni , Jaglak mosam Cheyaleda .

    Gurivinda dani kinda nalupu yeraganattu …! Neethulu chepthunnav

    1. Era Kavi, nee notlo emaina elakkaya molakkaya pettara raa

      jagan left Congress and started his own…

      cbn gaani madiri kaadugaa

      ntr power loki raagane pakkana cheraadu…

      At least Jagan has dignity to start his own party

  8. చంద్రబాబు బూట్లు తుడుస్తానన్నాడు ఒక నాని, రాజకీయాలు వదిలేస్తానన్నాడు ఒక అనిల్. మరి వాళ్ళనడగవే మాటమీద నిలబడమని. దీనినేమంటారు గురవిందగింజా!

      1. జగన్ లాంటి తుత్తరి గాడు సీఎం అవడ్డానికి కూడా అవే ఈవీఎం లు రా గొర్రెబిడ్డ అలియాస్ పేటీయం గ్రామసింహం…

Comments are closed.