హీరోలకు ఫ్యాన్స్ నిలువుదోపిడీ!

పెద్ద సినిమా వచ్చింది అంటే హీరోల ఫ్యాన్స్ కు ఓ జాతర లా వుంటుంది. ఏడాది, రెండేళ్ల కాలంగా తమ హీరోను తెర మీద చూడాలనే కోరికతో కిందా మీదా అయిపోతుంటారు. తల తాకట్టు…

పెద్ద సినిమా వచ్చింది అంటే హీరోల ఫ్యాన్స్ కు ఓ జాతర లా వుంటుంది. ఏడాది, రెండేళ్ల కాలంగా తమ హీరోను తెర మీద చూడాలనే కోరికతో కిందా మీదా అయిపోతుంటారు. తల తాకట్టు పెట్టి అయినా డబ్బులు తెచ్చి బెనిఫిట్ షో నో, స్పెషల్ షో నో చూసేయాలనుకుంటారు. దీన్నే, ఈ బలహీనతనే క్యాష్ చేసుకుంటున్నారు సినిమా నిర్మాతలు కావచ్చు, బయ్యర్లు కావచ్చు.

గతంలో బెనిఫిట్ షో లు అంటూ కొంత మొత్తానికి ఇచ్చేసేవారు. వాళ్లు అమ్ముకునేవారు. కానీ ఇప్పుడు నేరుగా డిస్ట్రిబ్యూటర్లే ఈ విధమైన టికెట్ లు అమ్మే పద్దతి కనిపెట్టారు.

పుష్ప 2 కి నైజాంలో 1200 ఏపీలో 800 పెట్టాల్సి వుంటుంది బన్నీ ఫ్యాన్స్ మూడేళ్లు తరువాత తమ హీరోను ముందుగా స్క్రీన్ మీద చూడాలంటే. లేదా ఆరు గంటలు ఆగి ఉదయం ఆట చూస్తే రేటు తగ్గుతుంది.

కానీ హీరోలు ఇలా చేయడం ఎంత వరకు సబబు. అది ఏ హీరో అయినా కావచ్చు. ఫ్యాన్స్ తమకు ప్రాణం అంటారు, ఫ్యాన్స్ లేకుంటే తాము లేము అంటారు. కానీ ఆ ఫ్యాన్స్ నే దోచుకునేందుకు సహకరిస్తారు. నిజానికి ఫ్యాన్స్ అంటే 90 శాతం యువత. పెద్దగా డబ్బులు లేని యువత. వాళ్లను ఇలా దోచుకోవడం న్యాయమా?

నిజంగా అభిమానం వుంటే ప్రతి ఊరిలో రెండు స్క్రీన్ లు కేవలం ఫ్యాన్స్ కోసం వేచి ఫ్రీగా చూపించాలి. లేదా తక్కువ రేటుకు చూపించాలి. ఫ్యాన్స్ ను ఆర్గనైజ్ చేస్తారు. లిస్ట్ లు మెయింటెయిన్ చేస్తారు. అందువల్ల ఈ రెగ్యులర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు ఎందుకు స్పెషల్ గా షో లు అరేంజ్ చేసే సంప్రదాయాన్ని ఏ హీరో కూడా స్టార్ట్ చేయరు.

అంటే ఫ్యాన్స్ అలా జీవితకాలం హీరోలను మోస్తూ వుండాలి. జేబులు గుల్ల చేసుకుని అంతా కలిసి మంచి ఓపెనింగ్ ఇచ్చి, కోట్లు కుమ్మరించాలి. అప్పుడు నిర్మాతకు ఈ ఓపెనింగ్ చూపించి హీరోలు వందల కోట్ల రెమ్యూనిరేషన్ అందుకోవాలి. ఇది ఒక హీరో గురించి కాదు. ప్రతి టాప్ హీరో చేసేది ఇదే.

ఫ్యాన్స్ కళ్లు తెరిచి, ఈ స్పెషల్ షో లను పక్కన పెట్టే వరకు వేల కొద్దీ రేట్లు, కోట్ల కొద్దీ దొపిడీ ఇలా సాగుతూనే వుంటుంది.

14 Replies to “హీరోలకు ఫ్యాన్స్ నిలువుదోపిడీ!”

  1. Matladithe pedda hero lu fans ma pranam, vallu lekapothe memu lemu ani kaburlu cheptharu. Ye okka hero ayina valla cinema release roju okka roju oke okka roju 2 theaters only fans kosam book chesi free ga chupinchada? Asalu aa akochana evadaina chesada? Vallu teesukune 100+, 200+ kotla mundu 1 crore fans kosam kharch chesthe emavutundi?

  2. హీరో చెప్పిన దాంట్లో తప్పేమీ ఉంది.

    1. ఫ్యాన్స్ తమకు ప్రాణం అంటారు. ఫ్యాన్స్ లేకపోతే మేము లేము అంటారు.

    నిజమే కదా… ఫ్యాన్స్ కాకపోతే మామూలు ప్రేక్షకులు వందలు, వేలు పోసి సినిమా ను పోషిస్తారా? ఫ్యాన్స్ లేకపోతే హీరోస్ ఎక్కడ?

    2. మీరన్నట్టు ఫ్యాన్స్ కోసం ఉచిత షోస్ వేస్తే మా కలెక్షన్స్ రికార్డ్ పొదూ ( ఇందులో కొంత ఫేక్ కూడా వేసుకుంటాం లెండి. అది వేరే విషయం)

  3. Collect extra money(whatever charged over and above the ticket price)from these benefit shows and since the heroes are drawing these crowds, respective hero should match the amount collected from both the states and donate the total amount to a social cause.

  4. మేము ప్రజలని ఉద్ధరించడానికే ఉన్నామని చెప్పుకుంటూ మద్యం వ్యాపారాలలో మునిగి తేలుతూ, నిత్యం ప్రజల జేబుల్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న రాజకీయ నాయకులతో పోలిస్తే వీళ్ళెంత?! మహా అయితే సంవత్సరానికి ఒక చిలక్కొట్టుడు?

Comments are closed.