బీసీ ఉద్యమ నాయకుడు ఆర్.కృష్ణయ్యకే అధికారికంగా ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ అధికారికంగా జాబితా ప్రకటించడం విశేషం. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దశంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపారు. వైసీపీ అధికారం కోల్పోవడంతో కృష్ణయ్య ఆ పార్టీకి, దాని ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
బీసీల హక్కుల కోసం పోరాటం చేయడానికే వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు కృష్ణయ్య చాలా కోతలు కోశారని విమర్శలున్నాయి. అయితే జాతీయ స్థాయిలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో టచ్‌లో ఉన్నారని, ఆ పార్టీ ద్వారా ముందస్తు ఒప్పందంలో భాగంగానే రాజీనామాకు తెరలేపారనే ఆరోపణలే, నేడు నిజమయ్యాయి.
రాజ్యసభకు పంపే ముగ్గురు అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య, అలాగే రేఖా శర్మ (హర్యానా), సుజీత్‌కుమార్ (ఒడిశా) పేర్లను ఖరారు చేయడం విశేషం. ఇంతకాలం కృష్ణయ్య చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారం లేనిదే ఒక్క రోజు కూడా ప్రతిపక్ష పార్టీలో వుండడానికి ఆసక్తి చూపని నాయకుల జాబితాలో కృష్ణయ్య చేరిపోయారు. వైసీపీకి, ఏపీకి సంబంధం లేని కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చి జగన్ తప్పు చేశారనే విమర్శలు సొంత పార్టీ నుంచి రావడం గమనార్హం. కనీసం రాజీనామాకు సంబంధించి ముందస్తు సమాచారం కూడా జగన్‌కు ఇవ్వలేదని కృష్ణయ్యే స్వయంగా తెలిపారు.
ఇంకో ఎంగిలి విస్తరాకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ లోకి స్వాగతం
చివరకు ఆంధ్ర బీజేపీ అంటే ఎంగిలి విస్తరాకుల సామూహంగా మారిపోవటం దురదృష్టకరం
మోడి షా లు ఎందుకు వీడిని తీసుకుంటున్నారో కదా? వైసీపీ నుండి ఆ కాండిడేట్ నీ బీజేపీ లో చేర్చుకొని ఆ పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది?
They didin’t learn lesson from the experinces with Kanna Lakshminarayana, Komatireddi brothers etc