పాపం చంద్రబాబు.. ఎందుకింత ప్రయాస!

దేశంలో జమిలి ఎన్నికలు వచ్చినా సరే.. ఏపీలో మాత్రం 2029లోనే ఎన్నికలు జరుగుతాయంటూ మీడియా ముందు సెలవిచ్చారు.

దేశంలో రాష్ట్రాల అసెంబ్లీలు- పార్లమెంటుకు జమిలిగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపేసిన సంగతి తెలిసిందే. ఇవాళో రేపో పార్లమెంటు ముందుకు బిల్లు వస్తుంది అని అంతా అనుకుంటున్నారు. 50 శాతం రాష్ట్రాలు కూడా ఆమోదించాలనే నిబంధనతో సంబంధం లేకుండా.. రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతుందని అనుకుంటున్న సమయంలో.. ఏదో ఒక ప్రయత్నం చేసి.. మూడింట రెండొంతుల మెజారిటీతో ఈ బిల్లు నెగ్గించుకోవాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది.

అయితే.. జమిలి రూపంలో ఈ దేశంలో ఎన్నికలు జరిగితే.. 2029 కంటె ముందే దేశమంతా ఎన్నికల నగారా మోగుతుందని అంతా అనుకుంటున్నారు. కానీ.. పాపం చంద్రబాబునాయుడు మాత్రం.. కాదు కూడదు.. 2029లోనే ఎన్నికలు వస్తాయి.. తమ ప్రభుత్వం అయిదేళ్లపాటు అధికారంలోనే ఉంటుంది.. అని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారు.

జమిలి ఎన్నికలు జరగబోతున్నందున 2027లోనే దేశమంతటా సార్వత్రిక ఎన్నికల నగారా మోగుతుందనేది ఒక అంచనా. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు అప్పటికి గడువు పూర్తవుతుంది కాబట్టి.. వాటి ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేయవచ్చునని పలువురు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ఉద్దేశమే ఖర్చు తగ్గించడం కాబట్టి.. వృథా ఖర్చులు లేకుండా చేయడానికి అది బెటర్ అంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి కూడా జమిలి ఎన్నికలు కార్యరూపం దాలిస్తే.. 2027లో అసెంబ్లీకి కూడా ఎన్నికలు వస్తాయని.. తాము కొంచెం శ్రద్ధగా ఉండి ప్రజల్లో పనిచేస్తూ ఉంటే.. ఖచ్చితంగా విజయం సాధిస్తామని కొన్నాళ్లుగా పార్టీ కేడర్ కు ప్రేరణ ఇస్తున్నారు. పార్టీ శ్రేణులను యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే తాజాగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చినా సరే.. ఏపీలో మాత్రం 2029లోనే ఎన్నికలు జరుగుతాయంటూ మీడియా ముందు సెలవిచ్చారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు పూర్తిగా అయిదేళ్ల పాటు సీఎం పదవిలో ఉండాలనే కోరిక పుష్కలంగా ఉండవచ్చు. కానీ, ఆయన పదవీకాలం కోసం దేశం సమష్టి ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాన్ని వాయిదా వేయరు కదా అనేది పలువురి ఆలోచన.

అయితే చంద్రబాబు మాత్రం.. తాను అయిదేళ్లూ పదవిలో ఉండబోవడం లేదు అని ప్రజలకు గానీ, పార్టీ కార్యకర్తలకు గానీ అర్థమైతే తన విలువ పడిపోతుందని భయపడుతున్నారో ఏమో తెలియదు గానీ.. జమిలి ఎన్నికలు వచ్చినా సరే.. ఏపీలో మాత్రం 2029లోనే ఎన్నికలు జరుగుతాయని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి జమిలి గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఎవరికి అవగాహన లేదో.. ఎవరి అంచనాలు కరెక్టో.. ఈ జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంటు ఎదుటకు వచ్చి.. చర్చలు సాగినప్పుడు అందరికీ అర్థమవుతుంది.

11 Replies to “పాపం చంద్రబాబు.. ఎందుకింత ప్రయాస!”

  1. గతంలో జమిలి రాకూడదని వాదించిన వారు ఇప్పుడు జమిలి రావాలని కోరుకుంటున్నారు ఇదే కర్మ అంటే ..

    గతంలో జమిలి వస్తుంది అని వాదించిన వారు ఇప్పుడు జమిలి 2029 లో రావాలని కోరుకుంటున్నారు ఇదే కర్మ అంటే..

  2. చాలా ఆత్రంగా ఉన్నారు… కానీ బయట ఏం జరుగుతుందో కూడా గమనించాలి.. ఏ ఎన్నికలు జరిగినా ఈసారి సింగిల్ డిజిట్ కి పరిమితం చేద్దామని కూటమి ప్రయత్నిస్తుంది .. ఒకవైపు రాజధాని పనులు, పోలవరానికి ఫండ్స్, కొత్త కంపెనీలకి ఒప్పందాలు, ప్రతిపక్ష నేతలు పాత కేసులతో ఉక్కిరి బిక్కిరి… ఇటువైపు ప్రతిపక్ష ప్రయత్నాలు, కృషి చూస్తుంటే శూన్యం .. దానికితోడు రోజుకొక అవినీతి కేసు బయటపడి ప్రతిపక్షం పైన జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది.. మీడియా, సోషల్ మీడియాలో ప్రతిపక్షం వీక్ గా కనిపిస్తోంది .. ఇవన్నీ చూస్తూ కూడా ఇంత కాన్ఫిడెన్స్ గా జామిలి కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు

  3. చాలా ఆత్రంగా ఉన్నారు… కానీ బయట ఏం జరుగుతుందో కూడా గమనించాలి.. ఏ ఎన్నికలు జరిగినా ఈసారి సింగిల్ డిజిట్ కి పరిమితం చేద్దామని కూటమి ప్రయత్నిస్తుంది .. ఒకవైపు రాజధాని పనులు, పోలవరానికి ఫండ్స్, కొత్త కంపెనీలకి ఒప్పందాలు, ప్రతిపక్ష నేతలు పాత కేసులతో ఉక్కిరి బిక్కిరి… ఇటువైపు ప్రతిపక్ష ప్రయత్నాలు, కృషి చూస్తుంటే శూన్యం .. దానికితోడు రోజుకొక అవినీతి కేసు బయటపడి ప్రతిపక్షం పైన జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది.. మీడియా, సోషల్ మీడియాలో ప్రతిపక్షం వీక్ గా కనిపిస్తోంది .. ఇవన్నీ చూస్తూ కూడా ఇంత కాన్ఫిడెన్స్ గా జామిలి కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు

  4. చాలా ఆత్రంగా ఉన్నారు… కానీ బయట ఏం జరుగుతుందో కూడా గమనించాలి.. ఏ ఎన్నికలు జరిగినా ఈసారి సింగిల్ డిజిట్ కి పరిమితం చేద్దామని కూటమి ప్రయత్నిస్తుంది .. ఒకవైపు రాజధాని పనులు, పోలవరానికి ఫండ్స్, కొత్త కంపెనీలకి ఒప్పందాలు, ప్రతిపక్ష నేతలు పాత కేసులతో ఉక్కిరి బిక్కిరి… ఇటువైపు ప్రతిపక్ష ప్రయత్నాలు, కృషి చూస్తుంటే శూన్యం .. దానికితోడు రోజుకొక అవినీతి కేసు బయటపడి ప్రతిపక్షం పైన జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది.. మీడియా, సోషల్ మీడియాలో ప్రతిపక్షం వీక్ గా కనిపిస్తోంది .. ఇవన్నీ చూస్తూ కూడా ఇంత కాన్ఫిడెన్స్ గా జామిలి కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు

Comments are closed.