తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు డ్రైవ్ నిర్వహిస్తే.. సాధారణంగా ఒకవెల్లువలాగా సభ్యత్వాలు నమోదు కావాలి. అధికార పార్టీతో పనులుంటాయి గనుక.. ఇష్టంతో నిమిత్తంలేకుండా సభ్యత్వం తీసుకునే వారు కూడా ఉంటారు. దానికి తగ్గట్టుగానే ప్రతి నలుగురిలో ఒకరు తెదేపా సభ్యుడిగా ఉండాలనే టార్గెట్ ను చంద్రబాబు పార్టీ శ్రేణులకు పెడుతున్నారు.
శనివారం నాటికి రాష్ట్రంలో మొత్తం 73 లక్షల సభ్యత్వాలు నమోదైనట్టు చెబుతున్నారు. ఇవి గొప్ప గణాంకాలే. అయితే.. చంద్రబాబు మాటలనే చాలా జాగ్రత్తగా గమనిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ప్రాభవం పెరుగుతున్నదా? తగ్గుతున్నదా? అనే భయం కలుగుతోంది. ఆ పార్టీ అవకాశవాదుల దిశగా, పతనం వైపు వెళుతున్నట్టుగా పార్టీ వారికే అనిపిస్తుంది.
73 లక్షల సభ్యత్వాలు వచ్చాయని అంటున్న చంద్రబాబునాయుడు. అందులో 54 శాతం కొత్తవారే తమ పార్టీ సభ్యత్వం తీసుకున్నారని అంటున్నారు. అంటే అర్థం ఏమిటన్న మాట? ఈ 73 లక్షల మందిలో కేవలం సగం మంది మాత్రమే.. గతంలో కూడా పార్టీ సభ్యులు! కాస్త వెనక్కు వెళ్లి గణాంకాలను పరిశీలిద్దాం.
2019 నాటి గణాంకాల ప్రకారం.. తెలుగుదేశం సభ్యత్వాల సంఖ్య 65 లక్షలు. 2024లో అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఇప్పటికి 73 లక్షలు ఉంది. అందులో సుమారు 35 లక్షలు కొత్తవారే అని చంద్రబాబునాయుడు స్వయంగా చెబుతున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? 2019లో తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉన్నవారిలో సుమారు 30 లక్షల మంది ఇప్పటిదాకా సభ్యత్వాలు తీసుకోలేదు. ఎందుకు? వారంతా ఇప్పుడున్న తెలుగుదేశాన్ని ఇష్టపడడం లేదా? అసహ్యించుకుంటున్నారా? అనేది చంద్రబాబునాయుడే ఆత్మపరిశీలన చేసుకోవాలి.
73 లక్షల్లో 54 శాతం అంటే.. 35 లక్షలకు పైగా కొత్తవాళ్లు సభ్యత్వాలు తీసుకున్నారంటే చంద్రబాబునాయుడు మురిసిపోవాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎగబడి కొత్తగా తొలిసారి సభ్యత్వాలు తీసుకునే వారు అవకాశవాదులే అయి ఉండే అవకాశం ఎక్కువ. వారి విషయంలో ఆయన జాగ్రత్తగా ఉండడమే మంచింది. అదే సమయంలో.. 2019 లో ఉన్న 65 లక్షల సభ్యుల్లో ఇంకా 30 లక్షల మంది ఎందుకు సభ్యత్వాలు తీసుకోలేదో చంద్రబాబు కనిపెట్టగలిగితే.. ఆయన ప్రభుత్వం మరింత మెరుగ్గా పనిచేయగలుగుతుంది.
ఇంకా ఆశలు ఉన్నట్టున్నాయి నీకు అన్న మీద
nee s y c o g a d i p a r t y , b a t u k u c h o o s u k o m u n d u p u k a …..m
nee p a r t y , b a t u k u c h o o s u k o m u n d u p u k a …..m
nee p a r t y , b a t u k u c h o o s u k o m u n d u p u k a …..m