పులివెందులలో సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైసీసీ చేతులెత్తేయడంతో , అక్కడ కూడా వైఎస్ జగన్ పని రాజకీయంగా అయిపోయిందనే వాదనను టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున తెరపైకి తెస్తోంది. పులివెందులలోనే జగన్ బలహీనపడితే, ఇక రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు.
పులివెందుల వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట. 1978లో మొదటిసారి వైఎస్ కుటుంబం రాజకీయంగా పాగా వేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబమే పులివెందుల నుంచి గెలుపొందుతూ వస్తాంది. ఎన్నికలు ఏవైనా వైఎస్సార్ కుటుంబం ఎవరు చెబితే, వాళ్లే లీడర్.
అయితే తాజాగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైఎస్ కుటుంబం మాట చెల్లుబాటు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పులివెందులలోనూ సాగునీటి సంఘాల ఎన్నికలు కొన్నిచోట్ల ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 32 సాగునీటి సంఘాలున్నాయి. 32 సంఘాల్ని గంపగుత్తగా టీడీపీనే దక్కించుకుంది. దీంతో రాజకీయంగా జగన్ పని అయిపోయిందంటూ టీడీపీ అనుకూల మీడియా. టీడీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నట్టు పులివెందులలో జగన్ పట్టు కోల్పోయాడా? అంటే….అంత సీన్ లేదు.
రాజకీయాల్లో ఇలాంటివి మానసిక ఆటలో భాగం. సాగునీటి సంఘాల ఎన్నికలు నియంతృత్వ ధోరణిలో సాగాయనేది బహిరంగ రహస్యమే. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాల్సిన రీతిలో జరగలేదనే సమాధానం కూటమి నేతలే చెబుతారు.
పులివెందుల నియోజకవర్గంలో 32 సాగునీటి సంఘాలను టీడీపీ సొంతం చేసుకున్నంత మాత్రాన వైఎస్ జగన్‌కు రాజకీయంగా నష్టమని టీడీపీ అనుకోవడం అంటే, తనను తాను వంచించుకోవడమే. సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రజాతీర్పును ప్రతిబింబించేవి కానేకావు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి అధికారాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణల్ని కొట్టిపారేయలేం.
కుప్పంలో కూడా చంద్రబాబు పని అయిపోయిందని వైసీపీ ప్రచారం చేసింది. చివరికి ఏమైందో తెలుసు. టీడీపీ అదే తప్పుల్ని చేస్తోంది.
Mee karma
Neevu nerpina vidyaye Neerajaaksha
aite resign chesi malli yennikalaku vellamanu
పోనిలే, టీడీపీ పనే ఐపోయింది
అయ్యో మావోడ్ని సొంత ఊరిలో కూడా వొంగోబెట్టి దె0గారా?? ఎంత A1ల0గా గాడివి అయితే మాత్రం చివరికి ఇంత దిగజారి దె0గించుకుంటే ఎలా జెగ్గుల??
మా సంఘాలు వేరే
Correct
Never mr G A
reddy
nee brathuk u cheda, kuppam lo babu kastam nunchi, kadapa lo jagan pattu poyindi varaku vacchindi yevvaram!!!
ha ha ha artha nadamulu srvananadakaramuga vunnavi
అయ్యా గ్యాస్ ఆంధ్ర
అన్ని మాటలు తమరే చెబుతున్నారు ఒకసారి పని అయిపోయిందంటారు ఇంకోసారి కాదంటారు. ఆయన మోచేతి కింద నీళ్ళు తాగే నీకే ఒక స్థిర భిప్రాయం లేకపోతే ఇతరులకు ఎలా ఉంటుం ది అనుకుంటున్నారు. నువ్వు చెప్పింది కరెక్టే కానీ చంద్రబాబుతో జగన్ ను పోల్చలేము కదా. జగన్ పాలసీ రివర్స్ పాలసీ చంద్రబాబు పాలసీ ఫార్వర్డ్ పాలసీ. మరి రెండిటికి లంకె కుదరదు కదా. అతని పని ఉందా అయిపోయిందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి జస్ట్ వెయిట్ అండ్ సీ