దర్శకుడు వెంకీ అట్లూరి ఓ డిఫరెంట్ దారి ఎంచుకుని ముందుకు వెళుతున్నారు. విద్యా వ్యాపారం బ్యాక్ డ్రాప్ లో ధనుష్‌తో ఒక సినిమా చేసారు. బ్యాంక్ లావాదేవీల లొసుగుల నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ చేసారు.
ఈసారి తరువాత ప్రాజెక్ట్ కూడా వైవిధ్యంగా వుండబోతోందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు హీరోగా తమిళ సూపర్ స్టార్ సూర్య ను ఎంచుకున్నాడు. ఈ మేరకు సూర్యతో డిస్కషన్లు నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కూడా సితార సంస్థలోనే వుంటుంది.
ఈసారి కూడా వెంకీ అట్లూరి వైవిధ్యమైన సబ్జెక్ట్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. మారుతి కారు ఇండియాకు ఎలా వచ్చింది? దాని నేపథ్యం ఏమిటి? అనే బ్యాక్ డ్రాప్ లో వెంకీ అట్లూరి కథ రాసుకుంటున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఆసక్తికరంగా వుండే పాయింట్ నే. అందుకే సూర్య కూడా ఒకె చెప్పి వుంటారు. సూర్య ప్రస్తుతం ఓ మంచి సక్సెస్ కోసం చూస్తున్నారు. అదే టైమ్ లో తెలుగు లో సరైన డైరెక్ట్ సినిమా కోసం ఎప్పటి నుంచో చూస్తున్నారు.
అందువల్ల ఇది సరైన లాంచింగ్ అవుతుంది. ఇప్పటికే ఇద్దరు పరభాష హీరోలకు మంచి హిట్ లు ఇచ్చారు. అందువల్ల సూర్య కు అట్రాక్టివ్ పాయింట్ అవుతుంది. త్వరలో మరిన్ని వివరాలు బయటకు వస్తాయి.