ఈ ఏడాది మార్చి నెలలో పెళ్లి చేసుకుంది తాప్సి, ఉదయ్ పూర్ తో ఆమె పెళ్లి ఘనంగా జరిగింది. దానికి సంబంధించి వీడియోలు, ఫొటోలు కూడా బయటకొచ్చాయి. కట్ చేస్తే, తనకు గతేడాదే పెళ్లయిందని ప్రకటించి షాకిచ్చింది తాప్సి.
అవును.. 2023లోనే తాప్సి పెళ్లి చేసుకుందంట. దాదాపు పదేళ్లపాటు మథియాస్ బో, తాప్సి ప్రేమించుకున్నారు. అలా ప్రేమించుకొని, 2023 డిసెంబర్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారట. ఆ తర్వాత కొన్ని రోజులకు, అంటే 2024 మార్చిలో, కుటుంబ సభ్యుల కోసం ఉదయ్ పూర్ లో మరోసారి పెళ్లి చేసుకున్నారట.
ఉదయ్ పూర్ పెళ్లి ఫొటోలు బయటకురావడంతో తాము ఈ ఏడాదిలో పెళ్లి చేసుకున్నామని అంతా అనుకుంటున్నారని, కానీ చట్టరీత్యా తమ పెళ్లి 2023 డిసెంబర్ లోనే జరిగిందని ప్రకటించింది తాప్సి.
వ్యక్తిగత విషయాల్ని బయటపెట్టడం తనకు ఇష్టం ఉండదని అందుకే పెళ్లి మేటర్ ను బయటపెట్టలేదని ఆమె వెల్లడించింది. పైగా రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్న టైమ్ లో ఆమె సినిమా షూటింగ్ తో బిజీగా ఉందట. కేవలం పెళ్లి కోసం ఒక రోజు గ్యాప్ ఇచ్చి, పెళ్లి తర్వాత మరుసటి రోజు నుంచి తిరిగి షూటింగ్ కు వెళ్లిపోయిందంట.
Vellu iddaru gents lagee vunnaru ladies ekkada vunnaru