సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీ అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదలైన తర్వాత చాలామంది టాలీవుడ్ ప్రముఖులు అతడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. నిన్నంతా ఆ పరామర్శల పరంపర నడిచింది. ఈరోజు అల్లు అర్జున్ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
డ్రైవర్ ను కూడా తీసుకెళ్లకుండా తనే స్వయంగా కారు నడుపుతూ, భార్య స్నేహారెడ్డితో కలిసి చిరంజీవి ఇంటికెళ్లాడు బన్నీ. చిరంజీవితో కలిసి భోజనం కూడా చేసి తిరిగి ఇంటికెళ్లిపోయారు.
అల్లు అర్జున్ అరెస్టైన వెంటనే లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. బన్నీకి బెయిల్ రావడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఈ లాయర్ ను, చిరంజీవి రంగంలోకి దించారనే ప్రచారం నేపథ్యంలో, బన్నీ ఈరోజు తన మామయ్య ఇంటికెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేసు గురించి వీళ్లు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు కానీ, ఇద్దరి కలయికతో కాంపౌండ్ హీరోల మధ్య ఉన్న గ్యాప్ కాస్త కవర్ అయిందంటున్నారు కొంతమంది. ఈమధ్యకాలంలో మెగా కాంపౌండ్ కు దూరంగా జరుగుతూ వస్తున్నాడు బన్నీ.
ఎప్పుడైతే ఏపీ ఎన్నికల టైమ్ లో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా వెళ్లి ప్రచారం చేశారో, అప్పుడిక చీలిక స్పష్టమైంది. ఆ తర్వాత పలు సందర్భాల్లో పవన్ ను మెచ్చుకున్నాడు బన్నీ, తన సినిమాకు టికెట్ రేట్లు పెంచినందుకు ‘కల్యాణ్ బాబాయ్ థ్యాంక్యూ’ అంటూ స్పందించాడు కూడా. అలా గ్యాప్ ను భర్తీ చేయడానికి ప్రయత్నించిన బన్నీ, ఈరోజు చిరంజీవి ఇంటికెళ్లి మరింత చొరవ చూపాడు.
బన్నీ అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి తన షూటింగ్స్ అన్నీ రద్దు చేసుకొని బన్నీ ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే బన్నీని పోలీసులు తీసుకెళ్లారు. అట్నుంచి అటు పోలీస్ స్టేషన్ కు వెళ్డానికి కూడా చిరు రెడీ అయ్యారు. కానీ పోలీసుల విజ్ఞప్తితో ఆగిపోయారు. అలా తన కోసం తెరవెనక చాలా చేసిన చిరంజీవికి థ్యాంక్స్ చెప్పేందుకు బన్నీ స్వయంగా ఆయన ఇంటికెళ్లాడని అంటున్నారు.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో మరో భేటీ మిస్సయింది. ఈరోజు పవన్ కల్యాణ్, తన ఫ్రెండ్ త్రివిక్రమ్ తో కలిసి బన్నీ ఇంటికి వెళ్తారనే ప్రచారం జరిగింది. అది మాత్రం జరగలేదు. ఈ భేటీ కూడా పూర్తయితే చాలామందికి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.
If bunny meets pk ,please adgandi road meeda yenduku deeksha cheyyaledo??
arrest chesina few hours ke bail kooda vachindhi…. bail vachaka deeksha endhuku chestharu…. pawan kalyan road meedha deeksha chesindhi A.P border lo aaparani, cbn ni arrest chesaru ani kaadhu…. ykaapa party khaligaa unnaru…. allu meedha prema ekkuva ayipoyindhi kaabatti cheyyalsindhi deeksha
Mega kaapu family 😁😁😁😁😁🤣🤣🤣🤣🤣
anthele…talli chelli ni vadilesondiki support chesevallaki …..migata families alage untai
వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ ఒకటే, అభిమానులు పిచ్చివాళ్ళు అనవసరంగా పొట్లాడుకుంటున్నారు.
One night inside and now everything clear to Cunny. He knows who the real boss is now.
😂😂😂….mana payment kukkala mukha chitram yento ippudu…..
వీళ్లది..మెగా..ఫామిలీ..కాదు, స్వార్ధ..పూరిత ..యావరేజ్..కంటే ..మనసున్న ..వాళ్ళు . AA..మొదటిగా..కలవ..వలసింది..పరామర్శించవలిసినది..బాధిత..కుటుంబాన్ని..హాస్పిటల్లో..కొట్టుమిట్టాడుతున్న..ఆమె..కొడుకుని. వీళ్ళ..సంక..వీళ్లే..నాక్కుంటున్న..వీలేమి..మనుషులు? రేవంతారెడ్డి..చెప్పినట్టు..వీళ్ళేమన్నా..బోర్డుర్లో..యుద్ధము..చేసినోల్లా? హీరోలు..కాదు..జీరోలు.
Black Reddy frustration as most black reddys want kapus to support crmnl redy like most kamas wamt kapus to support CBN as otherwise they wouldnt; mind targetting Chiru/Pawan because in their opinion,they are low class kapus who shouldn’t have independant thinking
Black Reddy frustration as most black redys want kapus to support crmnl redy like most kamas wamt kapus to support CBN as otherwise they wouldnt; mind targetting Chiru/Pawan because in their opinion,they are low class kapus who shouldn’t have independant thinking
He can’t meet badhitakutumbam Due to court orders
బూతులు లేకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చేసే కామెంట్స్ ని పోస్ట్ చేస్తే .. యాక్సెప్ట్ చేసే ధైర్యం లేక డిలీట్ చేస్తున్న మీరు వెబ్సైట్ నడపటం వేస్ట్ .. లేదంటే కామెంట్ సెక్షన్ తీసేయండి