మరో ఏడాదిలో పెళ్లి

వేరే ఫీల్డ్ కు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే.. షేర్ చేసుకోవడానికి చాలా విషయాలు ఉంటాయని చెబుతోంది.

ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. దాదాపు పాతిక మంది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా హీరో శ్రీసింహా కూడా పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ అమృత అయ్యర్ కూడా పెళ్లి చేసుకుంటానంటోంది. కాకపోతే ఇంకో ఏడాది టైమ్ తీసుకుంటుందంట.

“మరో ఏడాది తర్వాత పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంది. ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వ్యక్తిని మాత్రం చేసుకోను. ఇండస్ట్రీకి వెలుపల ఉన్న వ్యక్తినే పెళ్లాడాలని అనుకుంటున్నాను. సేమ్ ఫీల్డ్ కు చెందిన వ్యక్తిని చేసుకుంటే సమస్యలొస్తాయని నా ఫీలింగ్.”

వేరే ఫీల్డ్ కు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే.. షేర్ చేసుకోవడానికి చాలా విషయాలు ఉంటాయని చెబుతోంది. ఆమె మాటలు చూస్తుంటే, ఆల్రెడీ ఆమెకు ఏదో మ్యాచ్ సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి అలాంటివేం లేవంటోంది అమృత.

ఒకే సినిమాకు మూడేళ్లు టైమ్ కేటాయించే అంశంపై కూడా స్పందించింది. హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో.. దానికి సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ ప్రాజెక్టు కోసం మూడేళ్లు కేటాయించాల్సి వస్తే అలా చేయడానికి సిద్ధమని ప్రకటించింది. “ఆ సినిమానే భవిష్యత్తు, అదే మనకు బ్రేక్ ఇస్తుంది అన్నప్పుడు దానిపైనే మూడేళ్లు ఉండడం తప్పులేదు.” అంటూ అభిప్రాయపడింది.

3 Replies to “మరో ఏడాదిలో పెళ్లి”

Comments are closed.