తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మొత్తం ఇండస్ట్రీని ఓ రౌండ్ వేసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. హీరోను పరామర్శించడానికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు, హాస్పిటల్ కు వెళ్లి చావు బతుకుల మధ్య ఉన్న పిల్లాడ్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. అసలు సినీ ప్రముఖులు ఏం ఆలోచిస్తున్నారు.. ఏం కోరుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు.
“ఒక్క రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లొచ్చిన వ్యక్తి ఇంటిముందు ఈ సినీ ప్రముఖులు క్యూ కట్టారు. ఆ హీరోకు కాళ్లుచేతులు పోయినట్టు కన్నీళ్లు కారుస్తూ, అతడ్ని పరామర్శిస్తున్నారు. నన్ను తిడుతున్నారు. అతడికేమైంది అసలు. కాలు పోయిందా.. కన్ను పోయిందా.. చేయి పోయిందా.. కిడ్నీలు దెబ్బతిన్నాయా..? అతడ్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, అభినందించారు.”
అల్లు అర్జున బెయిల్ ప్రాసెస్ పై కూడా స్పందించారు రేవంత్ రెడ్డి. హైకోర్టు బెయిల్ ఇచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఫార్మాలిటీస్ పూర్తయినంత వరకు ఎవరైనా జైళ్లో ఉండాల్సిందేనన్నారు. హీరోకు బెయిల్ వచ్చిందని అర్థరాత్రి 12 గంటలకు జైలు గేట్లు ఓపెన్ చేయరని అన్నారు.
తొక్కిసలాట ఘటనపై మాట్లాడుతూ, ఆల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్. తల్లి చనిపోయింది, బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ రూఫ్ టాప్ కారులో చేయి ఊపుతూ వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వీళ్లు అసలు మనుషులేనా అన్నారు.
“హీరో థియేటర్ వదిలి వెళ్లలేదు, అక్కడే కూర్చున్నాడు. థియేటర్ నుంచి వెళ్లమని, నేరుగా డీసీపీ వచ్చి హీరోతో చెప్పారు. పరిస్థితి చేయి దాటిపోయింది, అవసరమైతే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అలా బలవంతంగా హీరోను బయటకు తీసుకొచ్చారు. ఓ తల్లి చనిపోయింది, పిల్లాడు చావుబతుకుల మధ్య ఉన్నాడని తెలిసినా కూడా.. బయటకొచ్చిన హీరో వాహనంలో కూర్చొని వెళ్లకుండా, రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్లీ చేయి ఊపాడు. ఏం మనుషులు వీళ్లు.. వీళ్లకు ఏం చెప్పాలి. పరిస్థితి అదుపుతప్పినప్పుడు రోడ్ షో చేయడం ఏంటి?”
చనిపోయిన 11వ రోజు వరకు హీరో, ప్రొడ్యూసర్ ఎవ్వరూ చావుబతుకుల మధ్య ఉన్న పిల్లాడ్ని పరామర్శించలేదని, ఇది ఏ రకమైన మానవత్వం అన్నారు రేవంత్ రెడ్డి. ఇలాంటి మానవత్వం లేని వాళ్లను విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తీసుకెళ్తే, వాళ్లపై కూడా సదరు హీరో దురుసుగా ప్రవర్తించాడని అన్నారు.
“సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి, ఆ సినిమాకు ప్రత్యేక అనుమతులిచ్చింది మా ప్రభుత్వమే. పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో, ప్రజల ప్రాణాలు తీసేవాళ్లను ఏం అనొద్దంటే ఎలా? పోలీసులు విచారణ చేయాల్సిందే.. నిందితుల్ని శిక్షించాల్సిందే. మీరు వ్యాపారాలు చేసుకోండి.. సినిమాలు తీసుకోండి.. డబ్బులు చేసుకోండి.. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ప్రత్యేక అనుమతులు తీసుకుండి.. కానీ ప్రాణాలు తీసే ప్రత్యేక హక్కు ప్రభుత్వం ఇవ్వదు.”
హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలుడి వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వం భరిస్తుందని.. ఘటన జరిగిన మరుక్షణం నుంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని తను అప్రమత్తం చేసి బాలుడు ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Revanth Reddy baditiduni paramarchinchada ledu kada
రేవంత్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది
దెయ్యం కేసీఆర్ లా ఉంటదా ? లేక కవిత లాగ ఉంటదా ? అల్లు గాడిలా ఉంటదా వె..పుష్పా ?
Vellakunna hospitalo vaallaki government tharupuna help chesthunnadu. Bill lukuda kattaaaru
Hero emina aakasam nundi voodi paddara… vaaallani chudataniki risk chesi maree enduku veltharu… prekshakulu iche money thone vaallu bouncer lani pettukuni daggaraki rakunda tarimestaru…Nachite o rendu sarlu movies chudali anthe kani valla kosam ega badatam, banners kattadam, valla birthdays ki cake lu cut cheyadam ento janalu…
ఓ దమ్మున్న సీఎం రేవంత్ రెడ్డి అంతే!! మా కొజ్జా జగ్గడు ఉన్నది కూడా మాట్లాడలేదు.
ఓ దమ్మున్న సీఎం రేవంత్ రెడ్డి అంతే!!
itlaa jagan maatlaadi unte…
ippudu kukkina penlu
Now u realise who is real reddy.
మా కొజ్జా జగ్గడు ఉన్నది కూడా మాట్లాడలేదు .
Hat’s off CM Sir, this is what we common ppl are expecting.
మా జగ్గడు ఉన్నది కూడా మాట్లాడలేదు .
రేవంత రెడ్డి..సినిమావాళ్ళ..గురించి..మాట్లాడింది..100%..కరెక్ట్, జగన్..మీద..రెచ్చిపోయే..ఈ..వెదవలు..HYD..లో..కుక్కిన..పెనులు, కారణమూ..అందరికి..తెలిసిందే. HYD..వున్నా..వీళ్ళ..ఆస్తులు..డ్రగ్స్..కేసులు, ఇల్లీగల్..దందాలు..కాస్టింగ్..కౌచ్..వ్యవహారాలు.PK..లాంటి..డ్రగ్స్..తీసుకొనే..వాళ్ళు..ఇల్లీగల్..పెళ్లిళ్లు..చేసికొనే..వాళ్ళు..ఫార్మ్హౌస్లలో..అమ్మాయిల..జీవితాలు..నాశనము..చేసే..వాళ్ల్లు.. రాజకీయ..నాయకులు..అవ్వడము..సిగ్గు..చేటు. అది..EVM..లో..మహీమా..అని..తెలుసు, AP..లో..BJP..4..MP..సీట్ల..కక్కూర్తి..ఈ..దారుణానికి..వోడి..గట్టింది.
రేవంత రెడ్డి..సినిమావాళ్ళ..గురించి..మాట్లాడింది..100%..కరెక్ట్, జగన్..మీద..రెచ్చిపోయే..ఈ..వెదవలు..HYD..లో..కుక్కిన..పెనులు, కారణమూ..అందరికి..తెలిసిందే. HYD..వున్నా..వీళ్ళ..ఆస్తులు..డ్రగ్స్..కేసులు, ఇల్లీగల్..దందాలు..కాస్టింగ్..కౌచ్..వ్యవహారాలు.
Votuku note case lo sir ni kooda ilage paramarsincharu Mari bail vachaka….😂😂
I must appreciate revanths audacity , inspite of being a devotee of CBN, kudos
సూపర్ స్పీచ్
ee potti kondelu inthavarau isthamanna dabbu kuda ivvaledhu badhithulaku.. Thu veella bathukulu.. aa dabbu theesukoni gunthalo vesi poodchandi
Sollu Arjun gadiki padindi pidi baaga. Pushpam nijam gane hero la feel ayyadu
U r jealous …
Hospital lo vunna vallaki sahayam cheyandi