నేతలు ఖండించే కొద్దీ.. అర్జున్ కు నష్టమేనా?

బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు.. తమకు సంబంధం లేని వ్యవహారం అయినా.. ఇందులో వేలు పెడుతున్నారు.

సినిమా హీరోలు రాజకీయ వివాదాలు సృష్టించుకుని వాటి పర్యవసానాల్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండరు. వారి దృష్టి పూర్తిగా వ్యాపారం మీద మాత్రమే ఉంటుంది. అధికారంలో ఎవరున్నారనేది వారికి ముఖ్యం కానే కాదు. అధికారంలో ఉన్న వారిద్వారా తమకు కావాల్సిన పనులను చక్కబెట్టుకోవడం ఒక్కటే వారికి తెలిసిన విద్య.

అందుకే ఏం చేయాలో అవన్నీ చేస్తారు. ఎంత వరకు తగ్గాలో అంతా తగ్గుతారు. కేవలం తమ సినిమా వ్యాపారం సజావుగా సాగాలని మాత్రమే కోరుకుంటారు. అధికారంలో ఉన్నవారు మాత్రమే అని కాదు, రాజకీయంగా ఏ ఒక్క పార్టీతో కూడా వైరం పెంచుకోవడానికి ఇష్టపడరు.

కానీ.. అల్లు అర్జున్ చుట్టూ ముసురుకున్న వివాదం నేపథ్యంలో ప్రస్తుతం.. ఆయనకు అనుకూలంగా భారతీయ జనతాపార్టీ, భారత రాష్ట్ర సమితికి చెందిన అనేక మంది నాయకులు స్పందిస్తున్న తీరు, అల్లు అర్జున్ ను వెనకేసుకు వస్తున్న తీరు ఇవన్నీ కలిసి అర్జున్ కాంగ్రెసుకు శత్రువుగా మారుస్తున్నాయి. వీరి మద్దతు తియ్యగానే వారికి అనిపిస్తుంటుంది గానీ.. అందుకోసం కనీసం మరో నాలుగేళ్లు అధికారంలో ఉండగల కాంగ్రెసుతో శత్రుత్వం రావడాన్ని వారు ఇష్టపడరు. కానీ అదే జరుగుతోంది.

అల్లు అర్జున్ ను సమర్థితే.. అల్లు ఫ్యాన్స్ మొత్తం తమ పార్టీలకు అండగా ఉంటారని అనుకుంటున్నారో ఏమో గానీ.. బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు.. తమకు సంబంధం లేని వ్యవహారం అయినా.. ఇందులో వేలు పెడుతున్నారు. అల్లు అర్జున్ అరెస్టు దగ్గరినుంచి ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రతిపోకడను తప్పు పడుతున్నారు.

రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. రేవంత్ ను ఇరుకున పెట్టడం, ఆయనను బద్నాం చేయడం.. టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి శత్రువుగా మారుతున్నాడని రంగు పులిమేలా కాంగ్రెసు అధిష్ఠానం దృష్టిలో ఆయన మీద నెగటివ్ ఇమేజి ఏర్పడే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా వారి వ్యూహాల్లో భాగం కావొచ్చు. కానీ వారి ఖండన ముండనలు శృతిమించుతున్నాయి.

అల్లు అర్జున్ ను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యం తప్ప.. ప్రాక్టికల్ గా విమర్శ చేద్దామనే ఆలోచన ఈ రెండు పార్టీల్లోని చాలా మంది నాయకుల్లో కనిపించడం లేదు. లాజిక్ లేకుండా అర్జున్ ను వెనకేసుకు వస్తున్నారు. దీనివలన అల్లు అర్జున్ పనిగట్టుకుని అన్ని పార్టీల నాయకులతో తమను తిట్టిస్తున్నారని రేవంత్ సర్కారు భావించే అవకాశం ఉంది. దానివలన అర్జున్ పై వారు శత్రుత్వం పెంచుకుంటారు కూడా. దీనివల్ల అల్టిమేట్ గా అర్జున్ కు నష్టమే తప్ప.. వీసమెత్తు కూడా లాభం లేదని పలువురు అంచనా వేస్తున్నారు.

19 Replies to “నేతలు ఖండించే కొద్దీ.. అర్జున్ కు నష్టమేనా?”

  1. ఒరేయ్ గూట్లే…BRS, బీజేపీ స్పందించారు అంటే కనీసం ఆ రాష్ట్రం వారు…మరి ఏ సంబంధం లేని మన జఫ్ఫా గళ్ళు ట్వీట్లు పెట్టారు కదా…వాళ్ళకి చెప్పవ

  2. ఇంత తెలివి మీకు ఎప్పుడు వచ్చింది GA గారు, మరి ఇన్నాళ్లు అల్లు అర్జున్ గారు వీరుడు యోధుడు అంటూ మన మనస్సాక్షి లో ప్రోగ్రామ్స్ పైడ్ ఆర్మీ ముసుగులో వైస్సార్సీపీ వాళ్ళు పక్కనవాళ్ళ ని తిట్టడం దీన్ని ఎలా సమర్దిస్తారు

  3. ఇంతక ముందు వరకు మనిషివా మంచు మోహన్ బాబు వా అని తి!ట్టే వాళ్ళు ఇప్పుడు మనిషివా అల్లు అర్జున్ వా అని తి!ట్టు!కుంటున్నారు జనాలు…

  4. Bunny కి ఒక దేశానికి ఉన్నట్టు, ఏకంగా నీకు ఆర్మీ నే ఉంది so

    నీ ఆటిట్యూడ్ ఏమాత్రం తగ్గొద్దు రా బన్నీ..

    A1 సింహం and రకుల్ రావు మన పక్కే..

    నిన్ను “పుష్ పా” అనుకుంటున్నారు.. కాదు “WILD FIRE” అని నిరూపించు ద’మ్ముంటే..

    అవతల ఎవ్వడైనా

    నీయవ్వ తగ్గేదే లే..అనాలి లేకపోతే నువ్వు కేవలం “రేవంత్ నలిపిన ఫ్లవరు” ఐతావ్

    1. Yenduku langa gaaru e comments. Prati daaniki political intention to matladutaru. Movies vere reality vere Meeku teliyada? Okayana tikka annadu. Inkokayana simham antadu. Real ga ayipotara?

  5. చినికి చినికి గాలివాన అవుతోంది .. బెయిల్ తరువాత పరామర్శల లైవ్ లేకుండా వుండి వుంటే బాగుండేది .. సిఎమ్ అసెంబ్లీలో మాట్లాడిన తరువాత కౌంటర్ ఇవ్వకున్నా బాగుండేది .. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోతోంది.

Comments are closed.