రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు …అందరూ కలిసి జనాన్ని బకరా చేస్తున్నారు. అన్నీ బాగున్నప్పుడు రాజకీయ, సినిమా ప్రముఖులు పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకుంటుంటారు. తేడాలొస్తే మాత్రం పరస్పరం విమర్శలు చేసుకుంటుంటారు. ముఖ్యంగా పుష్ప-2 సినిమాతో పాటు ఆ చిత్రం హీరో అల్లు అర్జున్‌పై తెలంగాణ అధికార పార్టీ నాయకుల విమర్శలు విచిత్రంగా ఉన్నాయి.
పుష్ప-2 సినిమా బెన్ఫిట్ షోతో పాటు టికెట్ల రేట్లను ఇష్టానుసారం పెంచుకోడానికి అనుమతి ఇచ్చింది మొదట రేవంత్‌రెడ్డి సర్కారే. బెన్ఫిట్ షోలో సంధ్యా థియేటర్ వద్ద దుర్ఘటన… రాజకీయ రంగు పులుముకుంది. తప్పు తమది కాదంటే, తమది కాదని ప్రభుత్వం, సినిమా వాళ్లు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి హీరో బన్నీ, చిత్ర పరిశ్రమ ప్రముఖులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ మంత్రి సీతక్క తనవంతుగా అల్లు అర్జున్‌పై విరుచుకుపడ్డారు. జైభీమ్ లాంటి సందేశాత్మక చిత్రాలకు ప్రోత్సాహకం ఇవ్వలేదన్నారు. కానీ పోలీస్ బట్టలిప్పిన చిత్రాలకు అవార్డులు ఇస్తున్నారని మండిపడ్డారు. స్మగ్లర్ హీరో అయ్యాడని, పోలీస్ విలన్ అయ్యాడని పుష్ప సినిమాపై ఆమె సంచలన కామెంట్స్ చేశారు. స్మగ్లింగ్‌ను అరికట్టే పోలీస్ అధికారి విలన్‌గా చిత్రకరించేవి ఏం సినిమాలని ఆమె ప్రశ్నించారు.
అల్లు అర్జున్‌తో విభేదాలు తలెత్తిన తర్వాతే, సినిమాలో లోపాలన్నీ కనపడడం ఆశ్చర్యంగా వుంది. ఏ ప్రాతిపదికన పుష్ప-2 సినిమా టికెట్ల రేట్లు పెంచుకోడానికి తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో సీతక్క సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది. స్మగ్లర్‌ను హీరోగా చిత్రీకరించే సినిమాను ప్రోత్సహించే పాపంలో తమ ప్రభుత్వం కూడా భాగస్వామి అనే విషయాన్ని సీతక్క మరచిపోతే ఎలా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టికెట్ల రేట్లు పెంపునకు అవకాశం ఇచ్చి, ప్రేక్షకులు, అభిమానులు జేబులు ఖాళీ చేసేందుకు సినిమా వాళ్లకు తమ ప్రభుత్వం సహకరించడాన్ని సీతక్క గుర్తించుకోవాలని నెటిజన్లు హితవు చెబుతున్నారు.
స్టొరీ ని బట్టి బెనిఫిట్ షౌలకి పెర్మిషన్ నిర్ణయించరు! బెనిఫిట్ షౌల పెర్మిషన్ ని రాయితి అనరు!
.
ముందు బెనిఫిట్ షౌల కి… పన్ను రాయితీ లకీ… తెడా తెలుసుకొని రాయరా!
coRRECT
First Jaibheem exhibitors had to demand concession& tax free amount from TG government…..🤣
టికెట్ రేట్లు పెంచుకోవడానికి and బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినట్టు డ్రామా దె0గితే మండదా అధ్యక్షా??
ఆ డ్రామా కి, ఆ పొగరు ఆటిట్యూడ్ కి తగిన మూల్యం టోటల్ టాలీవుడ్ చెల్లించాల్సిందే
నాకెందుకో బన్నీ గాడు, తన ఆర్మీ తో సీఎం పై యుద్ధం చేస్తాడేమో అని భయంగా ఉంది.. ఎవరు గెలుస్తారో ఎం అవుతుందో ఏమో??
Anduku bayapadakudasu bunny okay small fellow ..But Evaro RR Brothers torture the reason Ani chanipoyadu antagaa .Rahul gandhi RR Ni arrest chest Adamo bhyapadaalemo
“పుష్పా అంటే రేవంత్ నలిపేసిన”ఫ్లవరు”
సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వాళ్లకు నచ్చిన ధర పెట్టుకుంటే , ఎవరికి భాద, ఎందుకు బాధ ?
Can anyone explain
Every body is ready to comment on artists. She is from Naxalism back ground but he IDOL is a fraudster LIke Reventh Reddy who was caught live offering bribe and yet he became a CM to protect the Law and Order. This is the sorry state of affairs in Indian governance.
వాళ్లని తిట్టే ముందు ఆ థియేటర్ ముందు జనాలు ఉన్న వీడియోలు ఒకసారి చూడు. కులపిచ్చి లో పడి వెనకేసుకు రాకు. డైలీ రోటీన్, జిమ్ వర్క్ ఆ, దేని కోసం బాబు? డబ్బుల కోసం కాదా?
Forest leader can become minister in the governament.
Orey babu permision is given before release. Ippudu watch chesi ilaa maatlaadithunnaaru , thappu ledhu