మళ్లీ అదే కాంబినేషన్ మరోసారి

సితార లో ధనుష్ సార్ సినిమా చేసారు. ఇప్పుడు ఇది రెండో సినిమా.

ధనుష్-వెంకీ అట్లూరి కాంబినేషన్… సార్ సినిమా. మంచి హిట్. మంచి సినిమా అనిపించుకుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణం. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ సెట్ అయ్యేలా కనిపిస్తోంది.

ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమా అందించిన వెంకీ అట్లూరి తరువాత సినిమాను తమిళ సూపర్ స్టార్ సూర్యతో సెట్ చేసుకున్నారు. కానీ దానికి ఇంకా టైమ్ వుంది. అందుకే ఈ లోగా మరో సినిమాను చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈ సినిమా ధనుష్ తో.

సితార లో ధనుష్ సార్ సినిమా చేసారు. ఇప్పుడు ఇది రెండో సినిమా. సార్ సినిమా తరువాత తెలుగులో శేఖర్ కమ్ములతో కుబేర సినిమా చేస్తున్నారు. అది దాదాపూ పూర్తి కావచ్చింది. అంటే తమిళంతో పాటు సమాంతరంగా తెలుగులో కూడా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారన్న మాట ధనుష్.

ధనుష్-సితార సంస్థ సినిమా కోసం ఈసారి ఏం సబ్జెక్ట్ రెడీ చేస్తున్నారన్నది ఇంకా తెలియదు. కానీ కచ్చితంగా డిఫరెంట్ సబ్జెక్ట్ అయి వుంటుంది. సూర్యతో మారుతి కార్ బయోపిక్ కథ ను రెడీ చేసి వుంచారు. అది 2026లో వుంటుంది.