అన్న‌పై త‌గ్గేదే లే అంటున్న మంచు మ‌నోజ్‌

త‌న అన్న మంచు విష్ణు నుంచి ప్రాణ‌హాని వుంద‌ని మ‌రోసారి మంచు మ‌నోజ్ ప‌హాడీ ష‌రీఫ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

త‌న అన్న మంచు విష్ణు నుంచి ప్రాణ‌హాని వుంద‌ని మ‌రోసారి మంచు మ‌నోజ్ ప‌హాడీ ష‌రీఫ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు కుటుంబంలో వివాదం మ‌రోసారి వీధిన‌ప‌డిన‌ట్టైంది. కొన్ని రోజులుగా మంచు మోహ‌న్‌బాబు కుటుంబంలో వివాదాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి.

మోహ‌న్‌బాబు భార్య నిర్మ‌ల పుట్టిన రోజు సంద‌ర్భంలోనూ వివాదం త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. ఆ రోజు కూడా మంచు విష్ణు త‌న‌ను చంప‌డానికి వ‌చ్చాడంటూ పోలీసుల‌కు మ‌నోజ్ ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మ‌నోజ్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్ని అత‌ని త‌ల్లి నిర్మ‌ల కొట్టి పారేశారు.

మ‌నోజ్ ఫిర్యాదులో ఆరోపించిన‌ట్టు విష్ణు ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని నిర్మ‌ల పోలీసుల‌కు లేఖ రాశారు. క‌రెంట్ లేకుండా చేసి, విష్ణు ఏదో చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్టు మ‌నోజ్ ఆరోపించారు. కానీ మంచు విష్ణు, మ‌నోజ్‌కు త‌మ ఇంట్లో స‌మాన హ‌క్కులున్నాయ‌ని నిర్మ‌ల తెలిపారు. ఆ రోజు విష్ణు కేక్ తీసుకొచ్చి త‌న పుట్టిన రోజును సెల‌బ్రేట్ చేసి వెళ్లిన‌ట్టు నిర్మ‌ల తెలిపారు.

అలాగే విష్ణు త‌న గ‌దిలో ఉన్న వ‌స్తువుల్ని తీసుకెళ్లాడే త‌ప్ప‌, మ‌నోజ్ ఆరోపించిన‌ట్టు మ‌రోలా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని ఆమె తెలిపారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి విష్ణు నుంచి త‌న‌కు ప్రాణ‌హాని వుంద‌ని మ‌నోజ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. విష్ణు స్పంద‌న‌, అలాగే పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

5 Replies to “అన్న‌పై త‌గ్గేదే లే అంటున్న మంచు మ‌నోజ్‌”

  1. అల్లు అర్జున్ ఇష్యూ బాగా పాకాన పడి మా సినిమాకు పబ్లిసిటీ తగ్గిపోతోందని వీళ్ళ తాపత్రయం,

    అందుకే మాటిమాటికీ కొత్త కొత్త, వినూత్నమైన గొడవలతో రచ్చ చేస్తున్నారు

Comments are closed.