రంగంలోకి దిగిన జ‌గ‌న్‌!

క‌డ‌ప కార్పొరేష‌న్ వైసీపీ నుంచి చేజార‌కుండా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్వ‌యంగా రంగంలోకి దిగారు.

క‌డ‌ప కార్పొరేష‌న్ వైసీపీ నుంచి చేజార‌కుండా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్వ‌యంగా రంగంలోకి దిగారు. క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను సొంతూళ్లో జ‌రుపుకోవ‌డానికి మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఇవాళ ఆయ‌న బెంగ‌ళూరు నుంచి ఇడుపుల‌పాయ‌కు చేరుకుంటారు.

ఇడుపుల‌పాయ‌లో క‌డ‌ప కార్పొరేట‌ర్ల‌తో ఆయ‌న స‌మావేశం కానున్నారు. ఇటీవ‌ల ఏడుగురు వైసీపీ కార్పొరేట‌ర్లు టీడీపీలో చేరారు. అంత‌కు ముందే ఒక కార్పొరేట‌ర్ టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి ఒకే ఒక్క కార్పొరేట‌ర్ గెలుపొందారు. దీంతో టీడీపీ బ‌లం 9కి చేరింది. మొత్తం 50 మంది కార్పొరేట‌ర్లు ఉన్నారు. క‌డ‌ప కార్పొరేష‌న్‌ను టీడీపీ సొంతం చేసుకోవ‌డం అంత సులువేం కాదు. అయిన‌ప్ప‌టికీ కూట‌మి అధికారంలో వుండ‌డంతో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు మ‌రింత మంది గుర‌య్యే ప్ర‌మాదం వుంద‌ని వైసీపీ ఆందోళ‌న చెందుతోంది.

దీంతో క‌డ‌ప కార్పొరేట‌ర్ల‌తో జ‌గ‌నే స్వ‌యంగా మాట్లాడి, భ‌విష్య‌త్‌పై భ‌రోసా క‌ల్పించ‌డానికి వారితో స‌మావేశం కానున్నారు. అయితే జ‌గ‌న్ మాట‌ను ఎంత మంది గౌర‌విస్తార‌నేదే ప్ర‌శ్న‌. తాత్కాలికంగా జ‌గ‌న్ ఓదార్పు మాట‌ల‌కు కార్పొరేట‌ర్లు ఊ కొట్టొచ్చు. క‌డ‌ప ఎమ్మెల్యే మాధ‌వీరెడ్డి, ఆమె భ‌ర్త , వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్య‌క్షుడైన శ్రీ‌నివాస్‌రెడ్డి కార్పొరేట‌ర్ల‌ను ర‌క‌ర‌కాల అంశాల్ని తెర‌పైకి తెచ్చి, భ‌య‌పెట్టొచ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రీ ముఖ్యంగా క‌డ‌ప కార్పొరేష‌న్‌ను సొంతం చేసుకోవాల‌ని టీడీపీ ప‌ట్టుద‌ల‌తో వుంది. ఇందుకోసం ఏం చేయ‌డానికైనా సిద్ధం అనే రీతిలో ఆ పార్టీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకే జ‌గ‌న్ కూడా క‌డ‌ప కార్పొరేష‌న్‌ను నిలుపుకోడానికి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఇవాళ్టి స‌మావేశం కీల‌కంగా మార‌నుంది.

30 Replies to “రంగంలోకి దిగిన జ‌గ‌న్‌!”

    1. ఎవరు తేలేదు అంతా స్వయంకృతాపరాధము

      అతి నమ్మకము, అంతా నా ఇష్టం, అంతా రివర్స్ కదా అందుకే ఈ దీనస్థితి

  1. ఇలానె చంద్రబాబు చెస్తె… కొర్పొరెటర్ స్తాయికి పడిపొయిన చంద్రబాబు అని రాసెవాడు.

    1. నిజమే చెప్పారు. ఎవరు దీని గురించి కామెంట్ చేసిన చేయకపోయినా ఈ బోడి గ్యాస్ఆంధ్ర గాడు మాత్రం ముందు వరుసలో ఉండి కామెంట్ చేసేవాడు. ఇప్పుడు ఈ పని చేస్తున్నది వాళ్ళ అన్న కాబట్టి గ**** నోరు రెండు మూసుకొని ఉంటారు ఈ బోడి గాడు

  2. జగన్ కి పాస్టర్ గా మంచి భవిష్యత్ ఉంది ట్రై చేస్తే పనికొస్తుంది ఏలాగు గొర్రి bidde కదా.

  3. మా వూరి సర్పంచ్ వైసీపీ..అతన్ని టీడీపీ లోకి తెచ్చేందుకు భారీ కుట్ర జరుగుతుంది. please జగనన్న ఒక్క సారి మా వూరి కొచ్చి రెండ్రోజులు నిద్ర పోవా??

    1. ఫెంటాస్టిక్.. కానీ మావోడికి ప్యాలెస్ లో తప్ప పల్లెల్లో నిద్ర రాదు.. అదీ మంచం’మేట్ sajjal లేకుండా అస్సలు ఉండడు

  4. స్వయంగా ఆయన రంగంలో దిగుతున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

    ఎంతమందిని సముదాయించగలరు ఎన్ని రోజులు సముదాయించగలరు. మరి ఇంత హీనస్థితికి దిగజారడానికి కారకాలు ఎవరు ? చెప్పు గ్యాస్ ఆంధ్ర

  5. ఇంకా నయ్యం… రంగంలోకి అంటే అల్లు అర్జున్ కోసం రంగం లోకి అనుకున్న

  6. TDP చేసే కుట్రలు, కుతంత్రాలు మామూలే. కానీ ఏ బలం లేని అధికార టీడీపీ ఇంత నీచానికి దిగటం ఆపార్టీ ది గ జరుడు కీ ఇది నిదర్శనం

Comments are closed.