అల్లు అర్జున్ ఎపిసోడ్‌… డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగ‌మా?

హీరో అల్లు అర్జున్ వివాదాన్ని రేవంత్‌రెడ్డి స‌ర్కార్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే కొన‌సాగిస్తోందా? అంటే… ప్ర‌తిప‌క్షాలు ఔన‌నే స‌మాధానం ఇస్తున్నాయి.

హీరో అల్లు అర్జున్ వివాదాన్ని రేవంత్‌రెడ్డి స‌ర్కార్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే కొన‌సాగిస్తోందా? అంటే… ప్ర‌తిప‌క్షాలు ఔన‌నే స‌మాధానం ఇస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్‌తో పాటు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌పై ఘాటు కామెంట్స్ చేయ‌డం, ఆ త‌ర్వాత మంత్రులు, కాంగ్రెస్ నాయ‌కులు రెచ్చిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇదంతా వ్యూహం ప్ర‌కార‌మే జ‌రుగుతున్న వివాదంగా బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు భావిస్తున్నారు.

పాల‌న‌లో రేవంత్‌రెడ్డి విఫ‌ల‌మైంద‌ని ప్ర‌తిప‌క్షాలు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల నుంచి జ‌నాన్ని ప‌క్క‌కు మ‌ళ్లించేందుకే సినీ సెల‌బ్రిటీ అల్లు అర్జున్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, ఇప్పుడు విచార‌ణ పేరుతో మ‌రింత కాలం కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టుగా ప్ర‌తిప‌క్షాలు అనుమానిస్తున్నాయి.

తాజాగా బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ స‌ర్కార్ త‌న వైఫ‌ల్యాల‌ను కప్పి పుచ్చుకునేందుకు అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తోంద‌ని విమ‌ర్శించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి వాళ్ల పిల్ల‌ల్ని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశార‌న్నారు. హైడ్రా పేరుతో భ‌వ‌నాల‌ను కూల్చి, రియ‌ల్ ఎస్టేట్ కుదేల‌య్యేలా చేశార‌ని ఆమె అన్నారు.

ఇప్పుడు సినీ ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ నుంచి వెళ్లిపోయేలా కుట్ర జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో బౌన్స‌ర్ల‌ను పెట్టుకుని తిరిగిన ఏకైక నాయ‌కుడు రేవంత్‌రెడ్డి అని ఆమె ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఇలా అల్లు అర్జున్ ఎపిసోడ్‌ను రాజ‌కీయ ప‌క్షాలు త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌కు ఎప్పుడు ముగింపు ప‌లుకుతారో మ‌రి!

2 Replies to “అల్లు అర్జున్ ఎపిసోడ్‌… డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగ‌మా?”

Comments are closed.