పుష్ప-2 రాకతో బాలీవుడ్ లో రికార్డులు చెల్లాచెదురయ్యాయి. కొత్త బెంచ్ మార్కులు క్రియేట్ అయ్యాయి. మైలురాళ్లు మొదలయ్యాయి. ఇంకా చెప్పాలంటే, హిందీ బాక్సాఫీస్ లో పుష్ప-2 ఓ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారతీయ సినీచరిత్రలోనే తొలిసారి 700 కోట్ల రూపాయల మార్కెట్ ను క్రియేట్ చేసింది.
విడుదలైన 19 రోజుల్లో పుష్ప-2 హిందీ వెర్షన్ కు 704 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయి. అలా తొలిసారి 700 కోట్ల మార్క్ టచ్ చేసిన సినిమాగా పుష్ప-2 చరిత్ర సృష్టించింది.
అమీర్ ఖాన్ గజిని సినిమాతో బాలీవుడ్ లో వంద కోట్ల క్లబ్ మొదలైంది. ఆ తర్వాత త్రీ ఇడియట్స్ సినిమాతో 200 కోట్ల రూపాయల క్లబ్ ను, పీకే సినిమాతో 300 కోట్ల రూపాయల క్లబ్ ను అమీర్ ఖానే సృష్టించాడు.
ఇక బాహుబలి-2 హిందీ వెర్షన్ తొలిసారి 400 కోట్ల రూపాయల మార్క్ ను అందుకోవడంతో పాటు, అదే ఊపులో 500 కోట్ల రూపాయల క్లబ్ ను కూడా క్రియేట్ చేసింది. చాన్నాళ్ల పాటు ఈ మార్క్ ను మరో సినిమా అందుకోలేకపోయింది. కేజీఎఫ్-2 (హిందీ) కొడుతుందనుకున్నారు కానీ దాని వల్ల కూడా కాలేదు.
రీసెంట్ గా స్త్రీ-2 సినిమా బాహుబలి-2ను క్రాస్ చేసింది. ఏకంగా 600 కోట్ల రూపాయల నెట్ తో కొత్త రికార్డ్ సృష్టించింది. అయితే ఆ ఘనత ఎక్కువ రోజులు నిలవలేదు. పుష్ప-2 వచ్చింది. 600 కోట్లు కాదు, ఏకంగా 700 కోట్ల బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇండియాలో ఉన్న ప్రతి స్టార్ హీరోకు ఇప్పుడిదో టార్గెట్. బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్టులు చెప్పే మాటలబట్టి చూస్తుంటే.. ఈ రికార్డ్ చాన్నాళ్ల పాటు నిలబడిపోతుంది.
గేమ్ చేంజర్ కొడుతుంది
Vaadidi vaadu kottukovali. 50cr kottina Cinema superhittee.
కోడుతుంది బాత్రూంలో గేమ్ చేంజర్..
👌👌
ssmb29
Small correction first Bahubali 2 records crossed by jawan, pathaan, animal, gadar-2& stree-2& last one created new bench mark now pushpa-2