ఆరెస్సెస్ పాట పాడుతున్న ఆర్. కృష్ణయ్య

కృష్ణయ్య రాజ్యసభకు పంపడానికి కేవలం రెండు రోజుల ముందు మాత్రమే బీజేపీ సభత్వం తీసుకున్నాడు. ఇప్పుడేమో ఆరెస్సెస్ పాట పాడుతున్నాడు.

సాధారణంగా రాజకీయ నాయకులు పార్టీలు మారుతుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. లీడర్స్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పాడుతుంటారు. దీన్నే ఏ రోటి కాడ ఆ పాట పాడటం అంటారు. అలా పాడకపోతే రాజకీయ మనుగడ ఉండదు. రాజకీయ నాయకుడిగా మారిన తెలంగాణ బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్య కూడా ఆ పనే చేస్తున్నాడు.

ఆర్ . కృష్ణయ్య పేరు తెలియనివారు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరు. బీసీ నాయకుడిగా చాలా పాపులర్ కదా! బీసీల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి కదా. బీసీ నాయకుడిగా పాపులర్ అయ్యేసరికి రాజకీయ పార్టీల కన్ను ఆయన మీద పడింది. పార్టీలకు బీసీల ఓట్లు కావాలి కదా.

ఆయన మీద ముందుగా టీడీపీ వల వేసింది. 2014 ఎన్నికల్లో టీడీపీ ఆయన్ని హైదరాబాదులోని ఎల్బీ నియోజకవర్గం నిలబెట్టింది. తమ పార్టీ తరపున ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసింది. ఆయన గెలిచాడు. త‌ర్వాత‌ టీడీపీకి రాజీనామా చేశాడు.

ఈ తెలంగాణ నాయకుడిపై ఏపీలోని వైసీపీ కన్నుపడింది. 2022 లో ఏపీ నుంచి రాజ్యసభకు పంపింది. కానీ గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక కృష్ణయ్య రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేశాడు. ఆ తరువాత ఆయనపై బీజేపీ కన్నేసింది. ఏపీ నుంచి ఆయన్ని రాజ్యసభకు పంపింది.

బీసీ నాయకుడైన కృష్ణయ్యకు రాజకీయాలు బాగా ఒంటబట్టాయి. పార్టీలు మారుతుండటంతో ఏ రోటికాడ ఆ పాత పాడటం అలవాటైపోయింది. లేకపోతే రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టం. కృష్ణయ్య ఇప్పుడు బీజేపీ సభ్యుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కాబట్టి పార్టీ అధినాయకుల దృష్టిలో పడాలి కదా.

బీజేపీకి మూలం ఆరెస్సెస్ కదా. అది పట్టుకున్నాడు కృష్ణయ్య. తాను స్కూల్లో చదువుతున్నప్పటి నుంచే ఆరెస్సెస్ వాడినని, సంఘ్ అభిమానినని చెప్పాడు. చిన్నప్పటి నుంచే తనకు ఆరెస్సెస్ కు పనిచేయాలనే అభిలాష ఉండేదన్నాడు.

ఆరెస్సెస్ అంటే అంత ప్రేమ ఉంటే రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు నేరుగా బీజేపీలోనే చేరేవాడు కదా. కృష్ణయ్య రాజ్యసభకు పంపడానికి కేవలం రెండు రోజుల ముందు మాత్రమే బీజేపీ సభత్వం తీసుకున్నాడు. ఇప్పుడేమో ఆరెస్సెస్ పాట పాడుతున్నాడు. ఇలా చేయడం రాజకీయ మనుగడ కోసమేనా?

2 Replies to “ఆరెస్సెస్ పాట పాడుతున్న ఆర్. కృష్ణయ్య”

Comments are closed.