జ‌గ‌న్ బాటలోనే అంటున్న మంత్రి!

గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లో విద్యుత్ చార్జీలు పెంచ‌లేద‌ని ఆయ‌న అన్నారు. అంతేకాదు, నాణ్య‌మైన విద్యుత్‌ను అందించిన‌ట్టు కూడా ఆయ‌న చెప్పారు.

స‌మాధానం లేని వాళ్లే గ‌తం గురించి మాట్లాడుతుంటారు. ఔన‌న్నా, కాద‌న్నా చంద్ర‌బాబు స‌ర్కార్ విద్యుత్ స‌ర్దుబాటు చార్జీలు పెంచి ప్ర‌జా వ్య‌తిరేక‌తకు గురి అవుతోంది. అస‌లే, సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌డం లేద‌ని కూట‌మి స‌ర్కార్‌పై జ‌నం గొణుగుతున్నారు. ఇవ్వాల్సిన‌వి ఇవ్వ‌క‌పోగా, అద‌నంగా భారం వేయ‌డాన్ని ఎవ‌రైనా భ‌రించ‌గ‌ల‌రా? అందుకే కూట‌మి స‌ర్కార్ అప్ర‌తిష్ట‌ను మూట‌క‌ట్టుకుంటోంది.

ఈ నేప‌థ్యంలో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు విద్యుత్ చార్జీల‌పై కీల‌క కామెంట్స్ చేశారు. జ‌గ‌న్ ఇంటి ఎదురుగా వైసీపీ శ్రేణులు ధ‌ర్నా చేయాల‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చారు. ఎందుక‌య్యా అంటే, జ‌గ‌నే విద్యుత్ భారాన్ని ప్ర‌జ‌ల‌పై మోపినందుక‌ట‌! జ‌గ‌న్ భారాన్ని మోపితే, దాన్ని తొల‌గించాల్సిన బాధ్య‌త త‌మ ప్ర‌భుత్వంపై వుంద‌ని నిమ్మ‌ల రామానాయుడు ఎందుకు ఆలోచించ‌లేదో అన్న ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచ‌డంతో పాటు ట్రూ ఆఫ్ చార్జీలు అంటూ 16 వేల కోట్లు ప్ర‌జ‌ల‌పై భారం మోపార‌ని ఆరోపించారు. జ‌గ‌న్ పంథానే తాము న‌డుస్తున్నామ‌ని నిమ్మ‌ల రామానాయుడు చెప్ప‌క‌నే చెప్పారు. ఇప్పుడు కూట‌మి స‌ర్కార్ కూడా దాదాపు అంతే మొత్తంలో స‌ర్దుబాటు చార్జీల భారం ప్ర‌జ‌ల‌పై వేసింది. ఇక జ‌గ‌న్‌కు, త‌మ‌కు తేడా ఏంటో ఆయ‌నే చెప్పాలి.

గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లో విద్యుత్ చార్జీలు పెంచ‌లేద‌ని ఆయ‌న అన్నారు. అంతేకాదు, నాణ్య‌మైన విద్యుత్‌ను అందించిన‌ట్టు కూడా ఆయ‌న చెప్పారు. వ‌ర్త‌మానంలో చంద్ర‌బాబే సీఎంగా ఉన్నారు. ఇప్ప‌టి గొప్ప ప‌నులు నిమ్మ‌లంగా చెప్ప‌వ‌య్యా అంటే, అబ్బే ఏమీ లేవు అన్న‌ట్టుగా వుంది ఆయ‌న మాట‌ల తీరు.

3 Replies to “జ‌గ‌న్ బాటలోనే అంటున్న మంత్రి!”

  1. లోకనాథరావు మాయమైన మిస్టరీ: కులం, గబ్బిలాలు, మరియు గొడవలు!”

    లోకనాథరావు గారిని గుర్తు పట్టలేనంతగా అడ్డంగా పోయారట, మరి ఏం జరిగిందో? పూజారి కుటుంబం నుంచి వచ్చిన గౌరవనీయుడే కానీ, ఆయన డైలాగులు చూస్తే ఇంటర్వెల్ లో విలన్ లా ఫీలవుతుంది! “కాపు, కమ్మ” అంటూ మైక్ పట్టుకుని ప్రపంచానికి కుల ప్రబోధం చేయడంలో మేటి.

    ఒక్కోసారి ఒకరిద్దరితో చెడు అనుభవం ఉంటే, మొత్తం కులాన్నే తిట్టేయాలనిపిస్తుందేమో ఆయనకు. కానీ లోకనాథరావు గారు ఒక్కసారిగా గ్రేట్ ఆంధ్ర వెబ్‌సైట్ నుంచి డిస్పేర్ అయిపోయారు. జనాలు ఆయనకు ఏమైందో అని కంగారుపడుతున్నారు – కుల చర్చలతో హడావుడి చేసి, వెబ్‌సైట్ దారులు మరిచిపోయారా లేక “నేను ఇక్కడికి వస్తే ఇంట్లో నాన్నా బండలు పెడతారు” అనుకుంటున్నారా?

    ఇంకా చెప్పాలంటే, లోకనాథరావు గారు ఒక్కసారిగా డైరెక్ట్ గా తెరమీదకి రావాలి. కానీ ఈసారి కులం తీసుకుని కాదు, కబుర్లు తెచ్చుకోవాలి. చివరికి ప్రతీ కులంలో మంచి, చెడు వాళ్లు ఉంటారనే నిజం గ్రహిస్తే, ఆయన పెద్ద శాంతికర్త అవుతారేమో.

    అయితే ఎక్కడున్నారో ఆయన బాగానే ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మరి తిరిగి రాగానే “లోకనాథరావు 2.0″తో ఆశ్చర్యపరచగలరేమో చూద్దాం! 😄

Comments are closed.