డిసెంబర్ 5 నుంచి సంక్రాంతి వరకు

సంక్రాంతి సినిమాలకు మంచి ఓపెనింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. సంక్రాంతి సినిమాలకు మరో అడ్వాంటేజ్ ఏమిటంటే ఈసారి మూడే సినిమాలు వున్నాయి.

మొత్తానికి అనుకున్నట్లే అయింది. పుష్ప 2 సినిమా తరువాత మరో సినిమా లేకుండా అయిపోయింది. సరైన సినిమాలు థియేటర్ లోకి రాలేదు. వచ్చిన సినిమాలు జ‌నాలకు నచ్చలేదు. అసలు అటు దృష్టి పెట్టలేదు. అంటే సంక్రాంతి వరకు దాదాపు ముఫై అయిదు రోజుల పాటు మరో సినిమా లేదు. చూస్తే పుష్ప 2 చూడాలి, అది చూసేస్తే వెయిట్ చేయాలి. ఈ పరిస్థితి సంక్రాంతి సినిమాలకు అడ్వాంటేజ్‌గా మారేలా కనిపిస్తోంది.

ప్రతి ఏడాది డిసెంబర్ 20, 25 డేట్ లకు సినిమాలు వస్తున్నాయి. అంతో కొంతో నడుస్తున్నాయి. దానివల్ల డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి పండుగ వరకు సినిమాలు లేని పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. సినిమా ప్రియులు, సినిమా చూసి ఎన్నాళ్లయిందో అనుకునేలా మారింది. పుష్ప 2 సినిమాను తొలి రెండు వారాల్లో మాగ్జిమమ్ జ‌నాలు చూసేసారు. వాళ్లందరికీ ఇప్పుడు థియేటర్ లో సినిమా లేదు.

ఈ పరిస్థితి సంక్రాంతి సినిమాలకు మంచి ఓపెనింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. సంక్రాంతి సినిమాలకు మరో అడ్వాంటేజ్ ఏమిటంటే ఈసారి మూడే సినిమాలు వున్నాయి. సాధారణంగా నాలుగు సినిమాలు వుంటూ వుంటాయి.

మొదటి రోజు గేమ్ ఛేంజ‌ర్ నూటికి నూరు శాతం థియేటర్లు తీసుకుంటుంది. తరువాత ఢాకూ మహరాజ్‌తో సర్దుబాటు చేసుకుంటుంది. సింగిల్ స్క్రీన్ వున్న థియేటర్లలో కూడా మార్నింగ్, మాట్నీ ఒకటి ఫస్ట్ షో, సెకెండ్ షో ఒకటి అన్న లెక్కన వేసుకుంటారు. మూడో సినిమా వచ్చాక కూడా పెద్దగా సమస్య రాదు. మిగిలిన అన్ని చోట్లా స్క్రీన్ షేరింగ్ అన్నది అలవాటు అయిపోయింది కనుక సింగిల్ స్క్రీన్ లను పక్కన పెడితే ప్రతి సెంటర్లో మూడు సినిమాలు వుంటాయి.

7 Replies to “డిసెంబర్ 5 నుంచి సంక్రాంతి వరకు”

Comments are closed.