ఈసారి ‘మా’ మంచు విష్ణు ఏం చేస్తాడో!

మంచు విష్ణుకు అపాయింట్ మెంట్ ఇస్తే, అది రేవంత్ రెడ్డి ప్రతిష్టకు భంగం. సో.. ఈసారి ‘మా’ మంచు విష్ణు ఏం చేస్తాడో చూడాలి.

ఆయన రూటే సెపరేటు.. గతంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లో టాలీవుడ్ నుంచి చాలామంది ప్రముఖులు, జగన్ ను కలిశారు. ఇండస్ట్రీ సమస్యలు, ప్రోత్సాహకాలపై చర్చించారు. అయితే అటు నిర్మాతలతో, ఇటు హీరోలతో ఎవ్వరితో మంచు విష్ణు కలవలేదు.

తను ప్రత్యేకంగా జగన్ తో సమావేశమయ్యాడు. ఆయనతో లంచ్ చేశాడు. ఆ ఫొటోల్ని రిలీజ్ చేశాడు. భోజనం చేస్తూ ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చర్చలు జరిపామని ప్రకటించుకున్నాడు. టాలీవుడ్ కు అనుకూలంగా నిర్ణయాలు వెలువడితే, అందులో కొంత క్రెడిట్ ను తన ఖాతాలో కూడా వేసుకునేలా విష్ణు ముందస్తుగా అలాంటి ఏర్పాట్లు చేసుకున్నాడంటూ అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి.

ఇప్పుడు మరోసారి అలాంటి సందర్భమే వచ్చింది. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి వంతు. టాలీవుడ్ ప్రముఖులంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. 36 మంది సభ్యుల బృందం, రేవంత్ తో చర్చలు జరిపింది. అయితే మంచు విష్ణు అందులో లేడు. నిజానికి అతడు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఎంతోమంది హీరోల్లో అతడు కూడా ఓ హీరో. కాబట్టి హాజరవ్వాలా వద్దా అనేది పూర్తిగా ఆయన వ్యక్తిగతం.

కానీ మంచు విష్ణు హీరో మాత్రమే కాదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఈ హోదాలో తప్పనిసరిగా అతడు మీటింగ్ కు హాజరవ్వాలి. కానీ అతడు గైర్హాజరయ్యాడు. అలాంటప్పుడు సైలెంట్ గా ఉండకుండా ట్వీటేశాడు. సరిగ్గా ఇక్కడే ట్రోలింగ్ కు గురవుతున్నాడు మంచు విష్ణు.

అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఆయన రూటే సెపరేట్. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డిని కలిసి తను మిగతావాళ్ల కంటే స్పెషల్ అని చెప్పుకునే ప్రయత్నం చేసినా చేయొచ్చంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇస్తారా అనేది డౌట్. ఎందుకంటే, ప్రస్తుతం మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరాయి. మంచు విష్ణు, మోహన్ బాబు పై మంచు మనోజ్ కేసులు పెట్టాడు. మంచు మనోజ్ పై వీళ్లు కూడా రివర్స్ కేసులు పెట్టారు.

దీనికితోడు ఓ మీడియా జర్నలిస్ట్ పై మోహన్ బాబు, కెమెరా సాక్షిగా చేయి చేసుకున్నారు. దానిపై చాలా పెద్ద కేసు నడుస్తోంది. దీనికి సంబంధించి మోహన్ బాబు పరారీలో ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇలాంటి టైమ్ లో మంచు విష్ణుకు అపాయింట్ మెంట్ ఇస్తే, అది రేవంత్ రెడ్డి ప్రతిష్టకు భంగం. సో.. ఈసారి ‘మా’ మంచు విష్ణు ఏం చేస్తాడో చూడాలి.

7 Replies to “ఈసారి ‘మా’ మంచు విష్ణు ఏం చేస్తాడో!”

  1. మా ప్రెసిడెంట్ tho కాకుండా TG Gumpu మేస్త్రి సీఎంతో హీరోలు నిర్మాతలు చర్చలా?

    Daaaammmmm

  2. “మంచు కి మావోడు A1 బామ్మర్ది” కాబట్టి అప్పుడు అలా స్పెషల్ గా సాగిపోయింది కానీ ఈసారి ఈ “మంచు”ని విస్కీ లో కలుపుకుని తాగేస్తారు..

  3. రేవంత్ లాంటి టుమ్రీ గాళ్లతో మాట్లాడే రేంజ్ అనుకున్నావా మా స్నో అన్నది? వాట్ టాక్ యు మీన్? మావాడు తలుచుకుంటే మోడీతో మాట్లాడి రేవంత్ ప్రభుత్వాన్ని రద్దు చేయించగలాడు. కన్నప్ప సినిమాతో బెనిఫిట్ షోస్ లేకుండానే వెయ్యి కోట్లు కొట్టి చూపిస్తాడు. వెయిట్ ఎండ్ సీ.

Comments are closed.