పోయినోళ్లంతా గొప్పవాళ్లే అనే నానుడిని కాసేపు పక్కన పెడదాం. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అందనంత దూరాలకు వెళ్లిపోయారు. ప్రధానిగా భారతదేశానికి ఆయన చేసిన సేవల గురించి, ఒక్కొక్కటిగా తెలుసుకుంటే, మహానుభావుడు అని చేతులెత్తి దండం పెట్టుకుండా వుండలేరు.
సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఆధార్‌కార్డులు, జాతీయ ఉపాధిహామీ పథకం, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, చంద్రయాన్, మంగళ్‌యాన్… ఇలా ఎన్నెన్నో గొప్ప చట్టాలు, పథకాలు తీసుకొచ్చిన ఘనత మన్మోహన్‌సింగ్‌కు దక్కుతుంది. కానీ ప్రచారానికి ఆయన వెంపర్లాడలేదు. ప్రధానిగా పీవీ నరసింహారావు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా మన్మోహన్ కలిసి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లే, నేడు దేశం గర్వించదగ్గ స్థాయిలో వుంది.
మన్మోహన్‌సింగ్ మాటల ప్రధాని కాదు. ఆయన చేతల ప్రధాని. అందుకే ప్రధాని పదవికి ఆయన వన్నె తెచ్చారు. అవినీతి మరక అంటని ప్రధానిగా ఆయన్ను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుంది. అలాంటి మహానుభవావుడు తన గురించి చెప్పిన మాట…మనసులో నాటుకుపోయేలా వుంది.
“సమకాలీన మీడియా కంటే, పార్లమెంటులో ప్రతిపక్షాల కంటే చరిత్ర నా విషయంలో ఉదారంగా ఉంటుందని నేను నిజాయితీగా నమ్ముతున్నాను” అని ఆయన ఒక సందర్భంలో అన్నారు.
మన్మోహన్‌సింగ్ జీవించిన కాలంలో ఆయన ఘనత ఏమిటో ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు. కానీ ఆయన లోకాన్ని వీడిన తర్వాత, దేశానికి చేసిన అమూల్య సేవల గురించి తెలిసొస్తున్నాయి. అందుకే తన గురించి చరిత్ర ఎలా వుంటుందో ముందే అంచనా కట్టారు. ఔను, మన్మోహన్ విషయంలో ఆయన ఊహించిన విధంగా తప్పకుండా ఉదారంగా వుండి తీరుతుంది.
PV narsimha Rao gaariki oka poola gucham kudaa petteani ee Khan Grass chavatalu Eee Rubber stamp award icharu ..
కొన్ని తరాలపాటు గుర్తుండిపోయే ప్రధాని. ఆక్సిడెంటల్ ప్రధాని అయినప్పటికీ దేశానికి కొన్ని తరాలపాటు ఉపయోగపడే పనులు అదీ ఎప్పుడు ఊడుతుందో తెలీని కొలీషన్ గౌర్మెంట్లో సైలెంట్గా ఏ ప్రచారం ఆశించకుండా చేసాడు. May his soul rest in peace.
We did not thank enough to the great person
గాంధీ ఫ్యామిలీ కి ఊడిగం చేయడం ఒక్కటే డిస్టి చుక్క.