బాబు స‌ర్కార్‌పై టీడీపీ అనుకున్న‌దొక‌టైతే…!

ఆరు నెల‌ల పాల‌న‌లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది.

ఎన్నెన్నో అనుకుంటుంటాం. అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌క‌పోతే నిరాశ‌, నిస్పృహ త‌ప్ప‌వు. ప్ర‌స్తుతం టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల ప‌రిస్థితి కూడా అట్లే వుంది. ఈ ద‌ఫా ఎంతో ప‌క‌డ్బందీగా చంద్ర‌బాబు పాల‌న సాగిస్తార‌ని, ఆరోప‌ణ‌ల‌కు, వ్య‌తిరేక‌త‌కు ఏ మాత్రం చోటు ఇవ్వ‌ర‌ని టీడీపీ శ్రేణులు అనుకున్నాయి. కానీ అందుకు విరుద్ధంగా పాల‌న సాగుతోంద‌న్న ఆవేద‌న వాళ్ల‌లో వుంది.

2014-19 మ‌ధ్య పాల‌న‌లో జ‌రిగిన త‌ప్పుల్ని పున‌రావృతం కానివ్వ‌ర‌ని, వైసీపీకి మ‌రోసారి అవ‌కాశం లేకుండా చంద్ర‌బాబు చ‌క్క‌టి పాల‌న అందిస్తార‌ని టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎన్నెన్నో క‌ల‌లు క‌న్నారు. కానీ ఆ క‌ల‌లన్నీ క‌ల్ల‌లవుతున్నాయ‌నే భ‌యం వెంటాడుతోంద‌ని టీడీపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదేం విచిత్ర‌మో కానీ, ఆరు నెల‌ల పాల‌న‌లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది.

ఏ నియోజ‌క‌వ‌ర్గం తీసుకున్నా, కూట‌మి నాయ‌కుల దందాలే క‌నిపిస్తున్నాయ‌నేది బ‌హిరంగ చ‌ర్చే. చంద్ర‌బాబు వ‌ద్ద‌న్నా వినే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు పాల‌న‌లో గ‌తంలో ఈ బ‌రితెగింపు వుండేది కాదు. అక్క‌డ‌క్క‌డ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేసుకున్నా, పైకి క‌నిపించేది కాదు. కానీ ఇప్పుడు గాడి త‌ప్పింది. ప్ర‌జ‌ల‌న్నా, ప్ర‌భుత్వ పెద్ద‌న్నా భ‌యం లేకుండా పోయింది.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో, ఇక మ‌న‌కు భ‌విష్య‌త్‌లో అవ‌కాశం వుండ‌దేమో అని వైసీపీ నాయ‌కులు భ‌య‌ప‌డ్డారు. అయితే కూట‌మి పాల‌న చూస్తున్న నేప‌థ్యంలో, వైసీపీలో కేవ‌లం ఆరు నెల‌ల్లోనే అధికారంపై భ‌రోసా వ‌చ్చింది. మ‌న పాల‌నే మేలు అని వైసీపీ నాయ‌కులు సంతృప్తి చెందుతున్నారంటే, ఎలా అర్థం చేసుకోవాలి?

వైసీపీ నేత‌లే అనుకుంటే, మ‌నోళ్లు ఇంకా బ‌రితెగించార‌ని కూట‌మి కార్య‌క‌ర్త‌లు, ద్వితీయ శ్రేణి నాయ‌కులు అసంతృప్తిగా వున్నారు. ఇలాగైతే క‌ష్టం అని నిట్టూర్చుతున్నారు. ముఖ్యంగా అధికారం లేక‌పోతే జ‌న‌సేన‌, బీజేపీకి పోయేదేమీ లేదు. ఇబ్బంద‌ల్లా టీడీపీకే. అందుకే ఆ పార్టీ నాయ‌కుల్లో భ‌యం. బాబు పాల‌న‌పై ఏదేదో అనుకున్నామ‌ని, కానీ మ‌రేదో జ‌రుగుతున్న‌ద‌నే బాధ టీడీపీని వెంటాడుతోంది.

5 Replies to “బాబు స‌ర్కార్‌పై టీడీపీ అనుకున్న‌దొక‌టైతే…!”

  1. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి

  2. ఉట్టి ఎగరలేని ముం*డ స్వర్గానికి ఎగురుతాను అందంట..

    అసెంబ్లీ కి రాలేక ఆపసోపాలు పడుతున్న పి*చ్చోడు

    ఏదో పీకుతాడని వీళ్ళ జాకీలు నిచ్చెనలు..

    హైదరాబాద్ పోతే రేవంత్ తంతాడు

    తాడేపల్లి లో ఉంటే చంద్రబాబు తంతాడు అందుకే కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కాళ్ళు పట్టుకొని బతిమిలాడి బెంగుళూరు లో ఉంటున్న చారల పిల్లిరా ఈ పిచ్చోడు

  3. ఉట్టి ఎగరలేని ముండ స్వర్గానికి ఎగురుతాను అందంట..

    అసెంబ్లీ కి రాలేక ఆపసోపాలు పడుతున్న పిచ్చోడు

    ఏదో పీకుతాడని వీళ్ళ జాకీలు నిచ్చెనలు..

    హైదరాబాద్ పోతే రేవంత్ తంతాడు

    తాడేపల్లి లో ఉంటే చంద్రబాబు తంతాడు అందుకే కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కాళ్ళు పట్టుకొని బతిమిలాడి బెంగుళూరు లో ఉంటున్న చారల పిల్లిరా ఈ పిచ్చోడు

  4. ఒక్క గొడ్డలి తప్పు నుంచి తప్పించుకోవడానికి –

    కటికారెడ్డి శ్రీనివాసుల రెడ్డి (ఆత్మ హ..త్య ) –

    గంగాధర రెడ్డి (హ..త్య) –

    వాచ్మాన్ రంగన్న (narrowly escaped) –

    డ్రైవర్ నారాయణ (హత్య) –

    భారతి తండ్రి EC గంగిరెడ్డి (suspicious death) –

    అభిషేక్ రెడ్డి (suspicious death)

    still loading.

Comments are closed.