బాబు కంటే లోకేశే గ‌ట్టోడు!

ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కంటే ఆయ‌న కుమారుడు లోకేశ్ గ‌ట్టోడ‌నే అభిప్రాయం టీడీపీలో వుంది.

ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కంటే ఆయ‌న కుమారుడు లోకేశ్ గ‌ట్టోడ‌నే అభిప్రాయం టీడీపీలో వుంది. చంద్ర‌బాబుది నాన్చివేత ధోర‌ణి. లోకేశ్ ఫ‌టాఫ‌ట్ అంటూ దేన్నైనా వెంట‌నే తేల్చేస్తార‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఎన్నిక‌ల స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌నే విష‌య‌మై చ‌ర్చ జ‌రిగింది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డిన సంగతి తెలిసిందే.

జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు త‌మ నాయకుడైన ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండున్న‌రేళ్ల పాటు సీఎంగా ఉంటార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. అయితే అలాంటిదేమీ వుండ‌ద‌ని, చంద్ర‌బాబునాయుడే సీఎం అని లోకేశ్ తేల్చి చెప్ప‌డాన్ని టీడీపీ నాయ‌కులు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, ప‌వ‌న్‌కు ఏ ప‌ద‌వి ఇవ్వాల‌నేది చంద్ర‌బాబు చ‌ర్చించి నిర్ణ‌యిస్తార‌ని కూడా ఆ స‌మ‌యంలో లోకేశ్ స్ప‌ష్టం చేయ‌డం జ‌న‌సేన నేత‌లకు ఆగ్ర‌హం తెప్పించింది.

మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబును ఆయ‌న అనుకూల మీడియాధిప‌తులు న‌డిపిస్తున్నార‌నే ప్ర‌చారం వుంది. కొన్ని విష‌యాల్లో వాళ్లు చెప్పిన వాటికి చంద్ర‌బాబు త‌లూపుతున్న‌ట్టు సొంత పార్టీ నేత‌లే అంటున్నారు. కానీ లోకేశ్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం టీడీపీ అనుబంధ మీడియాధిప‌తులు, అందులో ప‌ని చేసే జ‌ర్న‌లిస్టుల‌కు కోపం తెప్పిస్తోంద‌ని తెలుస్తోంది. టీడీపీ అనుబంధ మీడియా బ్లాక్‌మెయిల్‌కు చంద్ర‌బాబు త‌లొగ్గ‌డం కొత్తేమీ కాదు. కానీ త‌న ద‌గ్గ‌ర అలాంటి ప‌ప్పులేమీ ఉడ‌క‌వ‌ని లోకేశ్ చ‌ర్య‌లే చెబుతున్నాయి.

లోకేశ్ కోట‌రీని కొంత మందిని ప‌నిగ‌ట్టుకుని టీడీపీ అనుబంధ వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తోందన్న విమ‌ర్శ లేక‌పోలేదు. అయితే త‌మ అనుకూల మీడియా నెగెటివ్ క‌థ‌నాలు రాసిన‌ప్ప‌టికీ, లోకేశ్ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా తాను అనుకున్న‌ట్టుగా ప‌ద‌వులు, అలాగే ప్రాధాన్యం ఇవ్వ‌డంలో వెన‌క్కి త‌గ్గ‌డం లేద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. నిజానికి జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోవ‌డం లోకేశ్‌కు ఏ మాత్రం ఇష్టం లేద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. కానీ టీడీపీ భ‌విష్య‌త్‌ను శాసించే ఎన్నిక‌లు కావ‌డంతో లోకేశ్ రాజీప‌డ్డార‌ని అంటున్నారు.

ప్ర‌భుత్వంలో ప‌వ‌న్‌కు, జ‌న‌సేన నేత‌ల‌కు చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇవ్వాల‌ని అనుకుంటున్న‌ప్ప‌టికీ, లోకేశ్ మాత్రం ప‌డ‌నివ్వ‌డం లేద‌ని అంటున్నారు. అందుకే ప‌వ‌న్ ప‌దేప‌దే చంద్ర‌బాబు నాయ‌క‌త్వం గురించి ప్ర‌శంసిస్తూ, లోకేశ్‌ను విస్మ‌రిస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఏ ర‌కంగా చూసినా… చంద్ర‌బాబు, లోకేశ్ రాజ‌కీయ పంథాకు స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తోంది. లోకేశ్ నిర్మొహ‌మాటంగా వుండాల‌ని అనుకుంటారు. చంద్ర‌బాబు మాత్రం ఆచితూచి అతి జాగ్ర‌త్త తీసుకుంటార‌ని ఆ పార్టీ నాయ‌కులు పోల్చి చెబుతున్నారు.

9 Replies to “బాబు కంటే లోకేశే గ‌ట్టోడు!”

  1. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి

  2. ఏందో నీ బాధ వర్ణనాతీతం….నిన్ననే లోకేష్ వెనక సీనియర్లు లేరు…లోకేష్ వేస్ట్ అన్నావ్…ఈరోజు ఏమో గట్టోడు అంటావ్…

  3. 8వ తేదీ వచ్చిన వైసీపీ అధ్యక్షుడు పేటీఎం కు క్క కు చిల్లర వేయక పోవడంతో ఇలా ఆర్టికల్స్ కి రాసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నాడు

    ఛీ ఏమి జర్నిలిజం రా లు చ్చా ఎదవ

Comments are closed.