స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితేనా? 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మరీ ఘన విజయం సాధించకపోయినా పరువు దక్కించుకునే అవకాశం ఉంటుంది.

ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంపైప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆరు గ్యారంటీల్లో అన్ని అమలు జరగడం లేదు. అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని రేవంత్ రెడ్డి ధీమాగా ఉన్నాడు. కానీ ఎమ్మెల్యేల్లో 28 మంది పనితీరు బాగాలేదని రేవంత్ రెడ్డికి రిపోర్టులు అందాయి. ఐదుగురు మంత్రుల పనితీరు కూడా బాగాలేదట.

ఎమ్మెల్యేల్లో నలభై శాతం మంది నియోజకవర్గాలను పట్టించుకోవడంలేదు. చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరమయ్యారట. మరి ఇలాంటి ఎమ్మెల్యేలతో, మంత్రులతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమేనని అంటున్నారు.

గులాబీ పార్టీ నాయకులు ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచుతున్నారు. పథకాల అమలుపై నిలదీస్తున్నారు. దబాయించి అడుగుతున్నారు. కేటీఆర్ ఈ యేడాదిని పోరాట నామ సంవత్సరంగా వ్యవహరించాలని నాయకులకు పిలుపునిచ్చాడు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ కమిషన్లు వేయడం, కేసులు పెట్టడం, విచారణలు జరిపిస్తుండంతో కేసీఆర్ ఫ్యామిలీకి రేవంత్ రెడ్డి మీద కసి పెరిగిపోయింది. ప్రతీకారం కోసం వెయిట్ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను అందుకు వినియోగించుకోవాలని వేచి ఉంది. హైదరాబాదులో హైడ్రా కూల్చివేతల కారణంగా పేద ప్రజల్లో వ్యతిరేకత విపరీతంగా పెరిగింది.

బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ వ్యతిరేకతని మరింత పెంచాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని గులాబీ పార్టీ ఎదురుచూస్తుండగా, ఈ ఎన్నికల్లో అంతో ఇంతో విజయం సాధించి వచ్చే ఎన్నికల నాటికి విజయానికి పునాదులు వేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నెగెటివ్ రిమార్కులు వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పనితీరు మార్చుకుంటే గానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మరీ ఘన విజయం సాధించకపోయినా పరువు దక్కించుకునే అవకాశం ఉంటుంది.

4 Replies to “స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితేనా? ”

  1. ప్లే బాయ్ వర్క్::- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.