ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తిపై హైకోర్టు సీరియ‌స్‌

ప్ర‌త్యేక షోల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అర్ధ‌రాత్రి వేళ అనుమ‌తి ఇవ్వ‌డంపై హైకోర్టు సీరియ‌స్ అయ్యింది.

ప్ర‌త్యేక షోల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అర్ధ‌రాత్రి వేళ అనుమ‌తి ఇవ్వ‌డంపై హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. రాంచ‌ర‌ణ్ హీరోగా న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ సినిమా టికెట్ల ధ‌ర‌లు, అలాగే ప్ర‌త్యేక షోలు వేసుకునేందుకు రేవంత్‌రెడ్డి స‌ర్కార్ అనుమ‌తి ఇచ్చింది. అర్ధరాత్రి దాటిన త‌ర్వాత తెల్ల‌వారుజామున షోలు వేసుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డంపై తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.

విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు తీవ్ర అసంతృప్తి, ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. బెనిఫిట్ షోలు ర‌ద్దు చేస్తున్నామంటూనే, ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తి ఎలా ఇచ్చార‌ని హైకోర్టు నిల‌దీసింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. భారీ బ‌డ్జెట్‌తో సినిమాలు తీశార‌నే కార‌ణంతో ప్రేక్ష‌కుల నుంచి రాబ‌ట్టుకోవాల‌ని అనుకోవ‌డం స‌రైంది కాద‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఇదిలా వుండ‌గా ఇక‌పై తెలంగాణ‌లో బెనిఫిట్ షోలకు అనుమ‌తి ఇచ్చేది లేద‌ని అసెంబ్లీ వేదిక‌గా సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అలాగే సంబంధిత శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా ఇదే విష‌యాన్ని చెప్పారు. అయితే ఆచ‌ర‌ణ‌లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ విష‌య‌మై బీఆర్ఎస్ ముఖ్య నాయ‌కుడు హ‌రీష్‌రావు తీవ్ర‌స్థాయిలో ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తి, అలాగే టికెట్ల ధ‌ర‌ల పెంపు వెనుక ఏం జ‌రిగిందో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

2 Replies to “ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తిపై హైకోర్టు సీరియ‌స్‌”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.