కొడుకుకు ధైర్యం చెప్పిన తండ్రి 

ఫార్ములా రేసు కేసులో ఇరుక్కున్న కేటీఆర్ ఏసీబీ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

కుమారుడికి ఆ తండ్రి ధైర్యం చెప్పాడు, ఈ కుమారుడు కేటీఆర్. ఆ తండ్రి కేసీఆర్. ఫార్ములా రేసు కేసులో ఇరుక్కున్న కేటీఆర్ ఏసీబీ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈడీ విచారణ జరగాల్సి ఉంది. ఫార్ములా రేసు కేసులో తాను ఏ తప్పు చేయలేదని, ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలే తిప్పి తిప్పి అడిగారని, అన్నిటికీ సమాధానాలు చెప్పానని, వాళ్లకు తెలియని విషయాలు కూడా చెప్పానని కేటీఆర్ అన్నాడు.

మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డిని బూతులు తిట్టాడని చెప్పొచ్చు. ఆయన మాదిరిగా తాము లుచ్చా పనులు చేయలేదని చెప్పాడు. తాను ఎవరికీ, దేనికీ భయపడనని అన్నాడు. వంద విచారణలు జరుపుకున్నా తనకు అభ్యంతరం లేదని, తాను సహకరిస్తానని చెప్పాడు. ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా వెళతానని అన్నాడు.

ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ మీద తండ్రి కేసీఆర్ తో చర్చలు జరిపాడు. మనం ఏ తప్పు చేయలేదని, భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ కుమారుడికి ధైర్యం చెప్పారు. పైశాచిక ఆనందంతో రేవంత్ రెడ్డి తమ పార్టీ మాజీ మంత్రుల మీద, నాయకుల మీద కేసులు పెడుతున్నాడని మండిపడ్డారు. అనవసరపు కేసులు పెట్టి భయపెడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

కాబట్టి ధైర్యం కోల్పోకుండా మొండిగా పోరాడాలని కేటీఆర్ కు ఆయన వెంట వచ్చిన ఇతర నాయకులకు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయాలని కేసీఆర్ చెప్పారు. సంక్రాంతి తరువాత నియోజకవర్గాలవారీగా నాయకులను పిలిపించుకొని మాట్లాడతానన్నారు.

5 Replies to “కొడుకుకు ధైర్యం చెప్పిన తండ్రి ”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.