ఆయ‌న నోరు త‌ప్ప‌… అంద‌రి నోళ్లు అదుపులో వుండాల‌ట‌!

ముందుగా తాను నోరు అదుపులో పెట్టుకుని, ఆ త‌ర్వాత ఇత‌రుల‌కు నీతులు చెబితే బాగుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి తీరు ఎలా వుందంటే.. త‌న నోరు మాత్రం అదుపులో పెట్టుకోర‌ట‌. ప్ర‌త్య‌ర్థులు మాత్రం త‌మ నోళ్ల‌ను అదుపులో పెట్టుకోవాలట‌. నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డం జేసీకి అల‌వాటుగా మారింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ‌ల బీజేపీ నేత‌ల‌పై ఎంత నీచంగా నోరు పారేసుకున్నారో అంద‌రికీ తెలుసు. మ‌హిళా నాయ‌కురాళ్ల‌పై నోరు పారేసుకుని, విమర్శ‌లు రావ‌డంతో క్ష‌మాప‌ణ చెప్పారు.

తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ శ‌వ‌రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మాజీ మంత్రి రోజా నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ‌వ‌ద్ద‌ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి హెచ్చ‌రించారు. నోరు అదుపులో పెట్టుకోవాల‌ని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. రోజాను బ‌య‌ట‌కు రాకుండా అడ్డుకోవాల‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న పిలుపు ఇచ్చారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో ఇలాంటివి జ‌రిగాయ‌ని ఆయ‌న ఆరోపించారు.

జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిని కూట‌మి నేతలెవ‌రూ సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. వ‌య‌సు పైబ‌డ‌డంతో నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతున్న‌ట్టున్నార‌ని ఆ మ‌ధ్య మంత్రి స‌త్య‌కుమార్‌, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. మాజీ మంత్రి పేర్ని నానిపై ఇష్టానుసారం తిట్టిన జేసీ, ఆయ‌న్ను కూడా బ‌య‌టికి రానివ్వొద్ద‌ని పిలుపు ఇచ్చారు.

ప్ర‌జాస్వామ్యంలో ఉన్నామ‌ని అనుకుంటున్నారో లేక త‌మ సామ్రాజ్యంలో అంద‌రూ బ‌తుకుతున్నార‌ని భావిస్తున్నారో గానీ, జేసీ మాత్రం హుకుం జారీ చేయ‌డం విమర్శ‌ల‌కు దారి తీస్తోంది. ముందుగా తాను నోరు అదుపులో పెట్టుకుని, ఆ త‌ర్వాత ఇత‌రుల‌కు నీతులు చెబితే బాగుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. టైమ్ పాస్ కోసం మీడియా ముందుకొచ్చి, వార్త‌ల్లో నిలిచేలా నోటికి ప‌ని చెబుతుంటార‌ని జేసీ గురించి ఆయ‌న అనుచ‌రులు అంటున్నారు.

7 Replies to “ఆయ‌న నోరు త‌ప్ప‌… అంద‌రి నోళ్లు అదుపులో వుండాల‌ట‌!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.