కొట్టుకోబోయిన‌ ఎమ్మెల్యేలు

బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన సంజ‌య్‌, ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఇదే కౌశిక్‌రెడ్డి నిల‌దీత‌కు కార‌ణ‌మైంది.

తెలంగాణ‌లో మంత్రుల స‌మ‌క్షంలో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కొట్టుకోబోయారు. ప‌ర‌స్ప‌రం తోసుకున్నారు. ఇంత‌లో ప్ర‌జాప్ర‌తినిధులు అడ్డుకోవ‌డంతో ఎమ్మెల్యేలు కొట్టుకోవ‌డం ఆగిపోయింది. ఈ ఘ‌ట‌నకు క‌రీంన‌గ‌ర్ జిల్లా స‌మీక్షా స‌మావేశం సాక్షిగా నిలిచింది. ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, సంజ‌య్ మ‌ధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి.

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా స‌మావేశానికి మంత్రులు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌, శ్రీ‌ధ‌ర్‌బాబు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ మాట్లాడుతుండ‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంత‌కూ నువ్వు ఏ పార్టీ అని ఆయ‌న నిల‌దీశారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన సంజ‌య్‌, ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఇదే కౌశిక్‌రెడ్డి నిల‌దీత‌కు కార‌ణ‌మైంది.

దీంతో ఇద్ద‌రి తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వెంత అంటే, నువ్వెంత అని ప‌ర‌స్ప‌రం తిట్టుకున్నారు. సంజ‌య్‌ని కౌశిక్‌రెడ్డి విసురుగా తోశారు. ఈ ద‌శ‌లో స‌మావేశానికి హాజ‌రైన నాయ‌కులు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. కౌశిక్‌రెడ్డిని బ‌య‌టికి తీసుకెళ్లారు. అనంత‌రం కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ భిక్ష‌తో సంజ‌య్ గెలిచి, కాంగ్రెస్‌లో చేరాడ‌ని మండిప‌డ్డారు.

సంజ‌య్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరిన మిగిలిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని స‌వాల్ విసిరారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను ఎక్క‌డైనా అడ్డుకుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఇదిలా వుండ‌గా మంత్రులు ఈ ఘ‌ట‌న‌ను ఖండించారు. ఇలా జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.

6 Replies to “కొట్టుకోబోయిన‌ ఎమ్మెల్యేలు”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, సున్నా, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.