మహా కుంభమేళా.. ఈ భూమ్మీద జరిగే అతిపెద్ద కార్యక్రమం ఇదే. ఈ రోజు ఈ మహా క్రతువు అంగరంగ వైభవంగా మొదలైంది. పుష్య పౌర్ణమి అయిన ఈరోజు పవిత్ర త్రివేణి సంగమం వద్ద తొలి స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలుగుతాయని హైందవుల విశ్వాసం.
ఈరోజు ఉదయం గం. 9.30కే 60 లక్షల మంది పవిత్ర స్నానం ఆచరించారు. సాయంత్రానికి కోటిన్నర మంది భక్తులు స్నానమాచరిస్తారని ఓ అంచనా. గంగ-యమున-సరస్వతి నదుల సంగమంగా చెప్పే ఈ ప్రాంతంలో, పవిత్ర స్నానాల కోసం 12 కిలోమీటర్ల మేర స్నాన ఘట్టాలు ఏర్పాటుచేశారు.
నేటి నుంచి 45 రోజుల పాటు జరగనున్న కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని వాహనాల్ని 10 కిలోమీటర్ల ముందే నిలిపివేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల నుంచి 10-12 కిలోమీటర్లు నడిచి సంగమానికి చేరుకోవాల్సి ఉంటుంది.
కేవలం భారతీయులు మాత్రమే కాదు, విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు పవిత్ర స్నానం కోసం భారతదేశానికి తరలివస్తారు. ఇప్పటికే రష్యా, బ్రెజిల్, బ్రిటన్ లాంటి చాలా దేశాల నుంచి భక్తులు ఇండియాకుచేరుకున్నారు.
భక్తుల సౌకర్యార్థం హెడ్డీపీవీ ప్లాస్లిక్ తో నీటిపై తేలియాడే ప్రత్యేక జెట్టీల్ని రూపొందించారు. నదిలో కొంత దూరం ఈ తేలియాడే జెట్టీలపై నడుచుకుంటూ వెళ్లి, అక్కడ స్నానం చేయొచ్చు. అంతేకాదు, ఇవే జెట్టీలపై చిన్నచిన్న గదులు కూడా ఏర్పాటుచేశారు. అక్కడే దుస్తులు మార్చుకొని తిరిగి ఒడ్డుకు రావచ్చు. ఇందులో వీఐపీ గదులు కూడా ఉన్నాయి.
ఈసారి కుంభమేళాకు ఓ ప్రత్యేకత ఉందంటున్నారు పండితులు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన రోజుల్లో ఈసారి కుంభమేళా పడిందంటున్నారు. ఈసారి కుంభమేళాను ఆకాశం నుంచి వీక్షించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ రైడ్స్ ఏర్పాటుచేశారు. 7-8 నిమిషాల పాటు హెలికాప్టర్ లో సాగే ఈ రైడ్ లో పైనుంచి కుంభమేళా దృశ్యాల్ని చూడవచ్చు.
ఫిబ్రవరి 26వరకు 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాలో 40 కోట్ల మందికి పైగా భక్తులు స్నానమాచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Good culture
Who told you that Pilgrims have to 10 Km from the places where their buses are stopped. From the Bus Parking place to Triveni Shuttle busses are arranged at free of cost. If busses are permitted into the city there will be traffic jam in the narrow roads of Prayagraj. Don’t utter idiotic blabbering without knowing the facts
🙏🙏🙏🙏🙏
పాప పంకిలm చేయడం అంటే మన మురికి జీవ నదులు కి అందించడం ల ఉంది ఈ తీరు చూస్తే.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు