సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో తాము పరస్పరం తిట్టుకున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని టీటీడీ ఈవో శ్యామలరావు, చైర్మన్ బీఆర్ నాయుడు సంయుక్తంగా తెలిపారు. ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో వాళ్లిద్దరు మాట్లాడారు. ముందుగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ కొన్ని మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియాలో అసత్య వార్తలు వస్తున్నాయని, నమ్మొద్దని కోరారు. చేతిలో ఫోన్ వుంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాస్తే మంచిగా వుండదని హెచ్చరించారు. తమ మధ్య విభేదాలున్నాయని కథలు అల్లడం సరైంది కాదన్నారు. ఆ ఒక్క దుర్ఘటన తప్ప, మిగిలిన అన్నీ బాగున్నట్టు తనకు వందలాది ఫోన్‌కాల్స్ వస్తున్నాయన్నారు.
అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. మిగిలిన పనుల్లో బిజీగా వుండడం వల్ల స్పందించడం కుదర్లేదన్నారు. కానీ ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఏర్పడిందని ఈవో తెలిపారు. ఈవో, చైర్మన్‌కు మధ్య సమన్వయం లేదని రాస్తున్నారన్నారు. ఈవో, టీటీడీ బోర్డు మధ్య సమన్వయం లేదని రాస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆధిపత్య పోరు నడుస్తోందని రాశారన్నారు. టీటీడీలో వ్యవస్థలన్నీ పతనమయ్యాయని, ఏవీ పని చేయలేదనే తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోందన్నారు. సోషల్ మీడియాలో ఏదైనా ఒక రాంగ్ ప్రచారం జరిగితే, అదే నిజమని నమ్ముతారన్నారు.
వీటిని ఖండించాల్సిన, అలాగే ఏది నిజమో చెప్పాల్సిన అవసరం కనిపిస్తోందని ఈవో తెలిపారు. చైర్మన్‌ను తాను ఏకవచనంతో సంబోధించినట్టు ప్రచారం వైరల్ అవుతోందన్నారు. దీనివల్ల దేవుని వదిలేసి, వ్యక్తిగతంగా వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుందన్నారు. టీటీడీ బోర్డులో తీసుకున్న నిర్ణయాల మేరకే అన్ని పనులు జరుగుతాయన్నారు. సమన్వయ లోపం అనేది నిజం కాదన్నారు.
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఏఈవో, తాను బోర్డు సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చినట్టు ఈవో తెలిపారు. సీఎం చంద్రబాబు వద్ద కొన్ని విషయాలు చర్చించామన్నారు. సీఎం వద్ద తాను, టీటీడీ చైర్మన్ తిట్టుకున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు. అసలు తాను, చైర్మన్ మాట్లాడుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు.
Nee tv 5 lo, yellow media lo pakkolla meeda false news rasiinappudu teliyadaa aaa noppi.. Siggu vundali B R naidu thatha
So, when everything was planned correctly, why did this incident happen and who is responsible for that incident?
ప్లే బాయ్ వర్క్ : తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
Good covering, hates off. Anyway everyone including you people without going to EGO pay regrets to suffering one’s do needful with blessings of Lord Venkateswara Swamy. Namo Narayana @ Krishna Rao